Shocking: Woman Arrested After Mothers Body Parts Found In Closet Tank In Mumbai - Sakshi
Sakshi News home page

Mumbai: ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో చిధ్రమైన స్థితిలో తల్లి మృతదేహం..కూతురు అరెస్టు

Published Wed, Mar 15 2023 5:16 PM | Last Updated on Wed, Mar 15 2023 7:27 PM

Woman Arrested After Mothers Body Parts Found In Closet Tank At Mumbai - Sakshi

ముంబైలోని ఇంట్లో ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో కుళ్లిన స్థితిలో ఉన్న ఓ మహిళ మృతదేహం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఆమె 23 ఏళ్ల కూతురుని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..వీణా జైన్‌ అనే మహిళ తన ఇంట్లోనే ఒక ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో శవమై కనపించింది. ఆమె మృతదేహం కుళ్లిన స్థితిలో ఉన్నట్లు తెలిపారు. అలాగే ట్యాంక్‌లోని స్టీల్‌ బాక్స్‌లో మాంసం, ఎముకల ముక్కలు కనిపించాయని పోలీసుల తెలిపారు. నెలల తరబడి బ్యాగ్‌లో ఉండటంతో మృతదేహం కుళ్లిన స్థితిలో ఛిద్రమై ఉందని తెలిపారు.

పోలీసులు అనుమానంతో మృతురాలి తోపాటు ఉంటున్న ఆమె కూతుర్ని సైతం పోలీసుల విచారించారు. ఐతే పోలీసులు ఆమే హత్య చేసి ఉండొచ్చన్న అనుమానంతో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, సదరు మహిళ వీణా జైన్‌ చివరిసారిగా నవంబర్‌ 26న చూశామంటూ మృతురాలి సోదరుడు, మేనల్లుడు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆమె కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు..చివరగా అనుమానంతో ఆమె అపార్ట్‌మెంట్‌ని సోదాలు చేయడం ప్రారంభించారు. అక్కడ ఒక ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో చిధ్రమై ఉన్న ఆమె మృతదేహ్నాన్ని గుర్తించినట్లు తెలిపారు పోలీసులు. ఐతే ఆమె గతేడాది డిసెంబర్లో మెట్లపై నుంచి పడిపోయిందని చెబుతున్నారు పోలీసులు. ఐతే ఆమె ఎలా చనిపోయిందనేది అనేది తెలియాల్సి ఉందన్నారు పోలీసులు. కాగా, ఇటీవల ఢిల్లీలో శ్రద్ధా వాకర్‌ని ఆమె ప్రియుడే కిరాతకంగా చంపిన ఘటన మరువుక మునేపే అదేతరహాలో వరుస ఘటనలు చోటు చేసుకోవడం బాధకరం.

(చదవండి: స్పీకర్‌ కార్యాలయం వద్ద గందరగోళం..ఎమ్మెల్యేలను నెట్టేసిన సిబ్బంది)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement