What Happens To The Body If Someone Dies In Space? Check Here For NASA Answer - Sakshi
Sakshi News home page

ఎవరైనా అంతరిక్షంలో మరణిస్తే!.శరీరం ఏమవుతుంది? ఏం చేస్తారు?

Published Wed, Aug 2 2023 5:03 PM | Last Updated on Wed, Aug 2 2023 6:40 PM

NASA Said If Someone Dies In Space What Happens - Sakshi

అంతరిక్ష పరిశోధనలు 60 ఏళ్ల కిత్రం నుంచే ప్రారంభమయ్యాయి. ఆ పరిశోధనల్లో భాగంగా అంతరిక్షయానం చేసిన ఎంతోమంది వ్యోమగాములు ప్రాణాలతో తిరిగి వచ్చే సమయంలో రాకెట్‌లో సాంకేతిక లోపం కారణంగానో మరేదైన కారణం వల్లనే చనిపోవడం జరిగింది. ఇలా ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. చెప్పాలంటే 1986 నుంచి 2003 వరకు నాసా స్పేస్‌కి సంబంధించి 14 మంది అంటే..1971లో సోయజ్‌ 11 మిషన్‌లో ముగ్గురు, 1976లో అపోలా1 లాంచ్‌ ప్యాడ్‌ అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యోమగాములు చొప్పున చనిపోయారు.

దీనిని బట్టి చూస్తే అంతరిక్షయానం ఎంత క్లిష్టంగా ఉంటుందో తెలుస్తోంది. అయినప్పటికి 2025 కల్లా చంద్రుడిపైకి, వచ్చే దశాబ్దం కల్లా అంగారకుడిపైకి వ్యోమగాములను పంపే సాహసం చేస్తుండటం విశేషం. ఒకరకంగా చెప్పాలంటే వాణిజ్యపరమైన అంతరిక్షయానం నిత్యకృత్యంగా మారింది. ఈ దృష్ట్యా అందరి మదిలో మెదిలే ప్రశ్న ఒకవేళ అంతిరిక్షంలోకి వెళ్లాక చనిపోతే ఏమవుతుంది?.. ఆ టైంలో మిగతా సిబ్బంది ఏం చేయాలి?.శరీరం ఏమవుతుంది. ఎలా ఖననం చేస్తారు వంటివి ఎదురవుతాయి.

చంద్రుడు లేదా మార్స్‌పై మరణం సంభవిస్తే..

  • నిజానికి వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లేముందే స్పేస్‌ మెడికల్‌ వైద్యులు అన్నిరకాల పరీక్షలు నిర్వహిస్తారు. వాళ్లు పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారని నిర్థారించాకే స్పేస్‌లోకి వెళ్లేందుకు అనుమతిస్తారు. తీరా అక్కడకి వెళ్లే సమయంలో భూమి కక్ష్య మిషన్‌లో ఎవరైన మరణిస్తే..కొన్ని గంట వ్యవధిలో క్యాప్సూల్‌(రాకెట్‌లో విడిపోగల భాగం) నుంచి భూమిపైకి తిరిగి పంపించవచ్చు.
  • ఇలాంటిదే చంద్రుని పైకి వెళ్లే క్రమంలో  జరిగితే సిబ్బంది కొద్దిరోజుల వ్యవధిలో మృతదేహంతో భూమికి తిరిగి రాగాలరు. ఇక్కడ సమస్య చనిపోవడం, ఆ మృతదేహాన్ని సంరక్షించటం అనేవి ప్రధాన సమస్య కావంటోంది నాసా. అదే సమయంలో అక్కడ ఉన్న ఇతర సిబ్బందికి సురక్షితంగా భూమిపైకి తిరిగి  రావడం అనేదే ప్రధాన సవాలు అని చెబుతోంది నాసా. 
  • అంగారక గ్రహానికి 300 మిలియన్‌ మైళ్ల ప్రయాణంలో వ్యోమగామి చనిపోతే గనుక తిరిగి వెళ్లడం కుదరని పని ఎందుకంటే..రాకెట్‌ మిషన్‌ ట్రిప్‌ ముగిసే వరకు ఆగాల్సిందే. తిరిగి రావడానికి కొన్ని ఏళ్ల సమయం పడుతుందని పేర్కొంది. ఇలాగో సిబ్బంది మృతదేహాన్ని ప్రత్యేక గదిలో లేదా ప్రత్యేకమైన బాడీ బ్యాగ్‌లో భద్రపరచాలి. అలాగే అంతరిక్ష వాహనం లోపల స్థిరమైన ఉష్ణోగ్రత, తేమ మృతదేహాన్ని రక్షించడానికి ఉపకరిస్తుంది కూడా. ఇవన్నీ కేవలం అంతరిక్ష కేంద్రం లేదా అంతరిక్షంలోకి వెళ్లే క్రమంలో ఏర్పడిన ఒత్తిడి కారణంగా చనిపోతే మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయని నొక్కి చెబుతోంది నాసా. 
  • ఎవ్వరూ కూడా స్పేస్‌సూట్‌ రక్షణ లేకుండా అంతరిక్షంలోకి అడుగుపెట్టడం అనేది అసాధ్యం. ఆ వ్యక్తి  తక్షణమే చనిపోతాడని చెబుతున్నారు స్పేస్‌ వైద్యులు. ఎందుకంటే పీడనం తక్కువగా ఉండటం, శ్వాస తీసుకోవడం కుదరక, రక్తం ఇతర ద్రవాలు ఆవిరైపోతాయని చెబుతున్నారు. పూర్తి స్థాయిలో ఆక్సిజన్‌ ఉండదు దీంతో రక్తం ఉడికిపోవడం మొదలవుతుందట. 

ఇదంతా కాదు సరిగ్గా అంతరిక్షంలోకి ల్యాండ్‌ అయ్యాక మరణిస్తే..
ఇలాంటి విపత్కర సమయంలో మిగతా సిబ్బంది ఆ  పరిస్థితిని తట్టుకునే మానసిక స్థితితో రెడీగా ఉండాలి. మృతదేహాన్ని భూమిపైకి తెచ్చేంతవరకు ప్రత్యేకమైన బాడీ బ్యాగ్‌లో భద్రపర్చి.. స్పేస్‌ సెంటర్‌కి తెలిపే తక్షణ ప్రోటోకాల్‌ అవసరం అని పేర్కొంది.  బాధిత కుటుంబాల ఆవేదనను అర్థం చేసుకుని వారికి సహాయ సహాకారాలు అందించాల్సిన బాధ్యతను స్పేస్‌ సెంటర్‌లు తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది నాసా. 

(చదవండి: అతనో రాజవంశస్తుడు..గే కావడంతో..ఎలక్ట్రిక్‌ షాక్‌ ఇచ్చి..)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement