someone
-
ఎవరైనా అంతరిక్షంలో మరణిస్తే!.శరీరం ఏమవుతుంది? ఏం చేస్తారు?
అంతరిక్ష పరిశోధనలు 60 ఏళ్ల కిత్రం నుంచే ప్రారంభమయ్యాయి. ఆ పరిశోధనల్లో భాగంగా అంతరిక్షయానం చేసిన ఎంతోమంది వ్యోమగాములు ప్రాణాలతో తిరిగి వచ్చే సమయంలో రాకెట్లో సాంకేతిక లోపం కారణంగానో మరేదైన కారణం వల్లనే చనిపోవడం జరిగింది. ఇలా ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. చెప్పాలంటే 1986 నుంచి 2003 వరకు నాసా స్పేస్‌కి సంబంధించి 14 మంది అంటే..1971లో సోయజ్ 11 మిషన్‌లో ముగ్గురు, 1976లో అపోలా1 లాంచ్ ప్యాడ్ అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యోమగాములు చొప్పున చనిపోయారు. దీనిని బట్టి చూస్తే అంతరిక్షయానం ఎంత క్లిష్టంగా ఉంటుందో తెలుస్తోంది. అయినప్పటికి 2025 కల్లా చంద్రుడిపైకి, వచ్చే దశాబ్దం కల్లా అంగారకుడిపైకి వ్యోమగాములను పంపే సాహసం చేస్తుండటం విశేషం. ఒకరకంగా చెప్పాలంటే వాణిజ్యపరమైన అంతరిక్షయానం నిత్యకృత్యంగా మారింది. ఈ దృష్ట్యా అందరి మదిలో మెదిలే ప్రశ్న ఒకవేళ అంతిరిక్షంలోకి వెళ్లాక చనిపోతే ఏమవుతుంది?.. ఆ టైంలో మిగతా సిబ్బంది ఏం చేయాలి?.శరీరం ఏమవుతుంది. ఎలా ఖననం చేస్తారు వంటివి ఎదురవుతాయి. చంద్రుడు లేదా మార్స్‌పై మరణం సంభవిస్తే.. నిజానికి వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లేముందే స్పేస్ మెడికల్ వైద్యులు అన్నిరకాల పరీక్షలు నిర్వహిస్తారు. వాళ్లు పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారని నిర్థారించాకే స్పేస్‌లోకి వెళ్లేందుకు అనుమతిస్తారు. తీరా అక్కడకి వెళ్లే సమయంలో భూమి కక్ష్య మిషన్‌లో ఎవరైన మరణిస్తే..కొన్ని గంట వ్యవధిలో క్యాప్సూల్(రాకెట్లో విడిపోగల భాగం) నుంచి భూమిపైకి తిరిగి పంపించవచ్చు. ఇలాంటిదే చంద్రుని పైకి వెళ్లే క్రమంలో జరిగితే సిబ్బంది కొద్దిరోజుల వ్యవధిలో మృతదేహంతో భూమికి తిరిగి రాగాలరు. ఇక్కడ సమస్య చనిపోవడం, ఆ మృతదేహాన్ని సంరక్షించటం అనేవి ప్రధాన సమస్య కావంటోంది నాసా. అదే సమయంలో అక్కడ ఉన్న ఇతర సిబ్బందికి సురక్షితంగా భూమిపైకి తిరిగి రావడం అనేదే ప్రధాన సవాలు అని చెబుతోంది నాసా. అంగారక గ్రహానికి 300 మిలియన్ మైళ్ల ప్రయాణంలో వ్యోమగామి చనిపోతే గనుక తిరిగి వెళ్లడం కుదరని పని ఎందుకంటే..రాకెట్ మిషన్ ట్రిప్ ముగిసే వరకు ఆగాల్సిందే. తిరిగి రావడానికి కొన్ని ఏళ్ల సమయం పడుతుందని పేర్కొంది. ఇలాగో సిబ్బంది మృతదేహాన్ని ప్రత్యేక గదిలో లేదా ప్రత్యేకమైన బాడీ బ్యాగ్‌లో భద్రపరచాలి. అలాగే అంతరిక్ష వాహనం లోపల స్థిరమైన ఉష్ణోగ్రత, తేమ మృతదేహాన్ని రక్షించడానికి ఉపకరిస్తుంది కూడా. ఇవన్నీ కేవలం అంతరిక్ష కేంద్రం లేదా అంతరిక్షంలోకి వెళ్లే క్రమంలో ఏర్పడిన ఒత్తిడి కారణంగా చనిపోతే మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయని నొక్కి చెబుతోంది నాసా. ఎవ్వరూ కూడా స్పేస్‌సూట్ రక్షణ లేకుండా అంతరిక్షంలోకి అడుగుపెట్టడం అనేది అసాధ్యం. ఆ వ్యక్తి తక్షణమే చనిపోతాడని చెబుతున్నారు స్పేస్ వైద్యులు. ఎందుకంటే పీడనం తక్కువగా ఉండటం, శ్వాస తీసుకోవడం కుదరక, రక్తం ఇతర ద్రవాలు ఆవిరైపోతాయని చెబుతున్నారు. పూర్తి స్థాయిలో ఆక్సిజన్ ఉండదు దీంతో రక్తం ఉడికిపోవడం మొదలవుతుందట. ఇదంతా కాదు సరిగ్గా అంతరిక్షంలోకి ల్యాండ్ అయ్యాక మరణిస్తే.. ఇలాంటి విపత్కర సమయంలో మిగతా సిబ్బంది ఆ పరిస్థితిని తట్టుకునే మానసిక స్థితితో రెడీగా ఉండాలి. మృతదేహాన్ని భూమిపైకి తెచ్చేంతవరకు ప్రత్యేకమైన బాడీ బ్యాగ్‌లో భద్రపర్చి.. స్పేస్ సెంటర్‌కి తెలిపే తక్షణ ప్రోటోకాల్ అవసరం అని పేర్కొంది. బాధిత కుటుంబాల ఆవేదనను అర్థం చేసుకుని వారికి సహాయ సహాకారాలు అందించాల్సిన బాధ్యతను స్పేస్ సెంటర్లు తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది నాసా. (చదవండి: అతనో రాజవంశస్తుడు..గే కావడంతో..ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి..) -
Sleep Paralysis: నిద్రిస్తున్నప్పుడు.. సమీపంలో ఎవరో ఉన్నట్లు అనిపిస్తుందా?
నిద్రిస్తున్నప్పుడూ..మీకు సమీపంలో ఎవరో ఉన్నట్లు అనిపిస్తుందా?. అక్కడ జరగుతున్నవన్నీ అర్థం అవుతుంటాయి. కానీ లేవలేరు. ఎంతలా.. లేద్దామనుకున్నా కళ్లు తెరవలేక నానా అవస్థలు పడతారు. చాలా సేపు కొట్టుకుని అతికష్టంపై మేల్కొంటారు. ఇలాంటి విషయాలు మీ స్నేహితులు లేదా మరేవరైనా చెబుతుండడం వినే ఉండే ఉంటారు. వాటిని తేలిగ్గా కొట్టిపారేయొద్దు అంటున్నారు వైద్యులు. ఎందకంటే అది స్లీప్ పెరాలసిస్ కావచ్చు అంటున్నారు. ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏంటి స్లీప్ పెరాలసిస్? ఎందుకు వస్తుంది నిద్ర పక్షవాతం ఇది ఒక పీడకలలా ఉంటుంది. నిద్రలేచినట్లు ఉంటుంది కానీ లేవలేం. లేవడానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా.. శరీరంలోని అవయవాలు ఏ మాత్రం సహకరించవు. విచిత్రం ఏమిటంటే.. అతను చూడటానికి నిద్రపోతున్నట్లు ఉంటాడు. తనకు హాని చేస్తున్న అనుభూతి పొందుతాడు. వినడం, లేచినట్లు, ఎవరైన సమీపస్తున్నట్లు తదితర అనుభూతులు అన్ని పొందుతాడు. ఇన్ని అనూభూతులు అనుభవించినా.. కదలలేడు. ఇలాంటి ఫీలింగ్ సాధారణంగా అందరికీ ఒక్కో సమయంలో అనిపించేవే. అయితే అది సాధారణంగా కొన్ని సెకన్లు మాత్రమే అలాంటి ఫీలింగ్ ఉంటుంది. కానీ కొందరికి అదొక భయానక అనుభవం. నిద్ర అంటే భయపడిపోయేలా చేస్తుంది ఆ పరిస్థితి. ఇంతకీ ఎందుకు వస్తుందంటే.. ఈ నిద్ర పక్షవాతం ఎందుకు వస్తుందనే దానికి కచ్చితమైన సమాధానం లేదని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి, రాత్రిపూట సరిగా నిద్రపోక పోవడం, నార్కోలెప్పీ, ఒత్తిడి, ఆందోళన, వివిధ భయాలు తదితర రుగ్మతలు ఉన్నా లేదా కుటుంబంలో ఎవరికైనా ఈ పరిస్థితి ఉంటే.. అది వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే పడుకునే ముందు ఎక్కువ ఆహారాన్ని తీసుకోకండి, మద్యం, ధూమపానం, కాఫీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. (చదవండి: ఈ వర్షాకాలంలో ఈ పండ్లు తీసుకుంటే..ఇమ్యూనిటీ ఫుల్!) -
హల్ చల్ చేస్తున్న 'డాడా-డింగ్'..!
దాదాపు పదిహేను రోజుల క్రితం కొత్తగా రిలీజైన ఓ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నైక్ కమర్షియల్ ఫీచరింగ్ యాక్టర్ దీపికా పదుకొనె సహా 10 మంది భారత క్రీడాకారిణులు నటించిన యాడ్.. వైరల్ గా మారింది. ఇది.. కేవలం పురుష ప్రపంచమే కాదని, మహిళల్లోనూ మహామహులు ఉన్నారని ఈ కొత్త యాడ్ నిరూపిస్తోంది. గ్రామీణ ప్రాంతాలనుంచీ వచ్చినా... గట్టి పోటీని ఎదుర్కొని గగనతలాలను తాకిన మహిళా సాధికారతను ప్రపంచానికి చాటుతోంది. స్పోర్ట్స్ మాన్యుఫాక్చరింగ్ దిగ్గజం నైక్.. రూపొందించి, తాజాగా విడుదల చేసిన బెస్ట్ కమర్షియల్ యాడ్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ మహమ్మద్ రిజ్వాన్ సృజనాత్మకత ప్రకటనలో స్పష్టంగా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. డాడా-డింగ్ అనే టైటిల్ తో విడుదలైన యాడ్ లో 12 మంది క్రీడాకారిణులతోపాటు.., వారి ఫిట్ నెస్ ట్రైనర్లు అదరహో అనిపించారు. 3 నిమిషాల నిడివితో ఉన్న యాడ్.. గ్రామీణ మహిళా శక్తిని సాక్షాత్కరిస్తోంది. గ్రామీణ మహిళలు డైలీ లైఫ్ లో ఎంత కష్టిస్తారో ఈ వీడియో ప్రత్యక్షపరుస్తోంది. శతాబ్దాలుగా నాలుగ్గోడల మధ్యా ఎటువంటి గుర్తింపూ లేకుండా మిగిలిపోతున్న మహిళా శక్తిని ప్రతిబింబింస్తూ ఈ ప్రకటన రూపొందింది. దీన్ని మహిళలకు అంకితమిస్తూ.. దర్శకుడు యూట్యూబ్ లో పోస్ట్ చేసిన కొద్ది రోజులకే ప్రశంసల వర్షం కురిపిస్తోంది. క్రికెటర్ హర్మాన్ ప్రీత్ కౌర్, హాకీ ప్లేయర్ రాణి రాం పాల్, ఫుట్ బాల్ ప్లేయర్ తన్వీ హంస్, మరో క్రికెటర్ స్మృతి మంధనా, స్క్వాష్ ప్లేయర్ జోష్నా చిన్నప్ప, ఫుట్ బాలర్ జ్యోతి, మరో క్రికెటర్ సుబ్బలక్ష్మి శర్మతో పాటు, స్ప్రింటర్ శ్వేతా హక్కే పర్సనల్ ట్రైనర్ శ్వేతా సుబ్బయ్య, సర్ఫర్ ఇషితా మాలవీయ, ఇన్ స్ల్రక్టర్, నమ్రతా పురోహిత్, ఫిట్ నెస్ ట్రైనర్ అర్మి కొథారె లతో కూడిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. తమ తమ ఆటల్లో అద్భుత ప్రతిభను ప్రదర్శిస్తున్న క్రీడాకారిణులతో రూపొందిన యాడ్.. హల్ చల్ చేస్తోంది. -
ప్రభుత్వం రైతులను మోసగిస్తోంది
సాక్షి, బెంగళూరు : రైతు సంక్షేమం పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా మోసం చేస్తోందని మా ముఖ్యమంత్రి, శాసన మండలి విపక్ష నాయకుడు సదానందగౌడ ఆరోపించారు. విధానసౌధలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన సోమవారం మాట్లాడారు. వక్క వల్ల ఎటువంటి హాని లేదని అందువల్ల ఆ పంట నిషేధం ఆలోచనలేదని చెబుతున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో మాత్రం వక్కలో హానికరమైన రసాయనాలు ఉన్నాయని ఎందుకు పేర్కొన్నారో రైతులకు చెప్పాలన్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కురిసిన అధిక వర్షాల వల్ల రూ.625 కోట్ల విలువైన వ్యవసాయ పంటలు నీటిలో మునిగిపోయాయన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రభుత్వానికి అందించిన నివేదికలో పేర్కొందన్నారు. అయితే ప్రభుత్వం రూ.25 కోట్లు మాత్రం విడుదల చేసి రైతులను అన్నివిధాలుగా ఆదుకున్నామని జబ్బలు చరుచుకుంటోందన్నారు. ఈ విధంగా ద్వంద్వ విధానాలతో రైతులను మభ్యపెడుతున్న సీఎం సిద్ధరామయ్యకు ఆ పదవిలో కూర్చొనే నైతికత లేదన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు రోషన్‌బేగ్, డీకే శివకుమార్‌లకు మంత్రిపదవులు ఎలా కేటాయిస్తారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. సిద్ధరామయ్య మాటపై నిలబడే మనిషి కాదన్నారు. ఇలాంటి వారు ముఖ్యమంత్రి వంటి ఉన్నత పదవిలో ఎలా కొనసాగుతున్నారని వ్యంగ్యంగా అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు దివాళా తీస్తోందన్నారు. అదే విధంగా రోడ్ల మరమ్మతుల విషయంలో, సీఈటీ సమస్య పరిష్కారంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సదానందగౌడ దుయ్యబట్టారు.