నిద్రిస్తున్నప్పుడూ..మీకు సమీపంలో ఎవరో ఉన్నట్లు అనిపిస్తుందా?. అక్కడ జరగుతున్నవన్నీ అర్థం అవుతుంటాయి. కానీ లేవలేరు. ఎంతలా.. లేద్దామనుకున్నా కళ్లు తెరవలేక నానా అవస్థలు పడతారు. చాలా సేపు కొట్టుకుని అతికష్టంపై మేల్కొంటారు. ఇలాంటి విషయాలు మీ స్నేహితులు లేదా మరేవరైనా చెబుతుండడం వినే ఉండే ఉంటారు. వాటిని తేలిగ్గా కొట్టిపారేయొద్దు అంటున్నారు వైద్యులు. ఎందకంటే అది స్లీప్ పెరాలసిస్ కావచ్చు అంటున్నారు. ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏంటి స్లీప్ పెరాలసిస్? ఎందుకు వస్తుంది
నిద్ర పక్షవాతం
ఇది ఒక పీడకలలా ఉంటుంది. నిద్రలేచినట్లు ఉంటుంది కానీ లేవలేం. లేవడానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా.. శరీరంలోని అవయవాలు ఏ మాత్రం సహకరించవు. విచిత్రం ఏమిటంటే.. అతను చూడటానికి నిద్రపోతున్నట్లు ఉంటాడు. తనకు హాని చేస్తున్న అనుభూతి పొందుతాడు. వినడం, లేచినట్లు, ఎవరైన సమీపస్తున్నట్లు తదితర అనుభూతులు అన్ని పొందుతాడు. ఇన్ని అనూభూతులు అనుభవించినా.. కదలలేడు. ఇలాంటి ఫీలింగ్ సాధారణంగా అందరికీ ఒక్కో సమయంలో అనిపించేవే. అయితే అది సాధారణంగా కొన్ని సెకన్లు మాత్రమే అలాంటి ఫీలింగ్ ఉంటుంది. కానీ కొందరికి అదొక భయానక అనుభవం. నిద్ర అంటే భయపడిపోయేలా చేస్తుంది ఆ పరిస్థితి.
ఇంతకీ ఎందుకు వస్తుందంటే..
ఈ నిద్ర పక్షవాతం ఎందుకు వస్తుందనే దానికి కచ్చితమైన సమాధానం లేదని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి, రాత్రిపూట సరిగా నిద్రపోక పోవడం, నార్కోలెప్పీ, ఒత్తిడి, ఆందోళన, వివిధ భయాలు తదితర రుగ్మతలు ఉన్నా లేదా కుటుంబంలో ఎవరికైనా ఈ పరిస్థితి ఉంటే.. అది వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే పడుకునే ముందు ఎక్కువ ఆహారాన్ని తీసుకోకండి, మద్యం, ధూమపానం, కాఫీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
(చదవండి: ఈ వర్షాకాలంలో ఈ పండ్లు తీసుకుంటే..ఇమ్యూనిటీ ఫుల్!)
Comments
Please login to add a commentAdd a comment