
హొళగుంద: ఇంట్లో మూడు రోజులుగా మృతదేహం ఉన్నా చుట్టుపక్కల వారికి తెలియలేదు. ఆదివారం ఒకటో తేదీ పింఛన్ ఇచ్చేందుకు వలంటీర్ ఆ ఇంటికి వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా హొళగుందలోని ఈబీసీ కాలనీలో టి.రాజేశ్వరి (55) ఉంటున్నారు. ఆమె భర్త హరినారాయణ పదేళ్ల కిందట మృతి చెందారు. కుమార్తె మంజుభార్గవికి వివాహం కావడంతో విజయవాడలో ఉంటున్నారు.
ప్రస్తుతం రాజేశ్వరి ఒక్కరే ఇంట్లో ఉంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున పింఛన్ ఇచ్చేందుకు వలంటీరు అనిల్ ఇంటికెళ్లి తలుపుతట్టగా ఉలుకు పలుకు లేదు. దుర్వాసన వస్తుండడంతో మరొకరి సహాయంతో తలుపులు తీయగా.. రాజేశ్వరి విగతజీవిగా కనిపించారు. వలంటీరు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆమె అనారోగ్యంతో మృతిచెందారా, ఇతర కారణాలేమైనా ఉన్నాయా అని పోలీసులు పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment