జననేత విడుదలతో డెట్రాయిట్లో వేడుకలు | YSR Congress Party Supporters Celebrations in Detroit | Sakshi
Sakshi News home page

జననేత విడుదలతో డెట్రాయిట్లో వేడుకలు

Sep 26 2013 11:35 PM | Updated on Jul 25 2018 4:07 PM

వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి విడుదలకావడంతో డెట్రాయిట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు.

డెట్రాయిట్: వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి విడుదలకావడంతో డెట్రాయిట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. తమ ఆనందాన్ని ఒకరికొకరు పంచుకున్నారు. తమ అభిమాన నాయకుడు నిర్బంధం నుంచి బయటపడడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. జగన్ బెయిల్పై విడుదల కావడం ఆంధ్రప్రదేశ్లో సానుకూల పరిణామమని పేర్కొన్నారు. ప్రస్తుత పాలకుల విధానాలతో విసిగిపోయిన తెలుగు ప్రజలకు జగన్ ఆశాకిరణమని వ్యాఖ్యానించారు.

జగన్ చరిత్ర సృష్టించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని తామంతా ఎదురుచూస్తున్నామని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జి. శ్రీకాంత్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్... ఎన్నారైలతో మాట్లాడారు. జగన్ విడుదల సందర్భంగా తమ సంతోషాన్ని ప్రవాసులతో పంచుకున్నారు.

లింగాల హరిప్రసాద్ రెడ్డి, వినోద్ కుకునూర్, రామచంద్రారెడ్డి, చింతలూరి శ్రీనివాస్, యుగంధర్ భూమిరెడ్డి, దేవా, సాగర్ రెడ్డి, వినోద్ ఆత్మకూర్, శివరామ్ యార్లగడ్డ, శ్రీధర్ తిప్పిరెడ్డి, శ్రీనివాస్ పిడపర్తి, కొండా రెడ్డి, రవికిరణ్, బీవీ రెడ్డి, కోటిరెడ్డి, విద్యాధర్ రెడ్డి, శేఖర్ పాంగారు, జగన్, శ్రీనివాస్ బార్లా, రావు నెరసు, చెంచురెడ్డి, వేణు, సాంబిరెడ్డి, విజయభాస్కర్ తదితరులు సంబరాల్లో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement