అమెరికాలో దసరా, బతుకమ్మ సంబరాలు | Bathukamma, Dasara celebratations in Detroit | Sakshi
Sakshi News home page

అమెరికాలో దసరా, బతుకమ్మ సంబరాలు

Published Fri, Oct 23 2015 8:05 PM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

అమెరికాలో దసరా, బతుకమ్మ సంబరాలు - Sakshi

అమెరికాలో దసరా, బతుకమ్మ సంబరాలు

డెట్రాయిట్: అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో దసరా, బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. ది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్‌) డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో శనివారం లిథుయానియన్ కాథలిక్ చర్చిలో ఈ వేడుకలను నిర్వహించారు. డెట్రాయిట్లో నివసిస్తున్న ప్రవాస తెలంగాణవాసులు ఈ కార్యక్రమానికి విచ్చేసి గౌరీమాత ఆశీస్సులు అందుకున్నారు.

ఈ వేడుకల్లో 700 మందికి పైగా పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడి పూజతో ప్రారంభమైన ఈ వేడుకల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు బతుకమ్మ నృత్యాలు చేశారు. 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..' అంటూ మహిళలు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో షాలిని కోపల్లి, కాకులవరం లక్ష్మణరెడ్డి, లోహిత్, కౌస్తుభ్, ఆకులమాదం శెట్టి, లట్టుపల్లి సోదరీమణులు రియా-రేవా, నిధిరెడ్డి కాకులవరం, మహిమ పాల్వాయి, శ్రావ్య డుంబాల, ఆత్మకూరు సోదరీమణులు సనిక-మేఘన, వర్ణిక జక్కా, ప్రసీద చెల్లెమెల్ల, అదితి మల్లేపల్లి, శ్రీత నటాల, యశస్వి, శ్రేష్ట దుండిగళ్ల, తన్మయి తిప్పిరెడ్డి, హారిక, ఆద్య చింతపల్లి, అదితి ఎర్ల, అనన్య భూమిరెడ్డి, సంజన కేసిరెడ్డి, ధ్రుతి పదుకొనె, ప్రవర్థ్ వేణుకాదసుల, కార్తీక్ గంకిడి, అన్విత, గడ్డంబ్రదర్స్ అనిష్, సంజింత్, సొహన్ కోస్నా, దీప్తి వేణుకాదసుల, విద్య గంకిడి, స్వాతి ఈర్ల, కెయూరజలిగామ, శ్రుతి కానాల, మనస్విని ముప్పా, వర్షిణి తదితరులుపాల్గొన్నారు. నిర్వాహక కమిటీ సభ్యులు రాజశేఖర్ గడ్డం, ప్రశాంత్ దుబ్బుడు, యాదగిర్ ఐలేని, కరుణాకర్ కందుకూరి, కృష్ణ చెల్లెమెల్ల, టీడీఎఫ్-యూఎస్ఏ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కసిరెడ్డి, స్టాండింగ్ కిమిటీ సభ్యులు సుమ కలవల, ఉమా పిషాటిలు.. కార్యక్రమ నిర్వహణలో సహకరించిన స్పాన్సర్లు, వాలంటీర్లను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement