తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ, దసరా సంబురాలు | Bathukamma Dasara Celebrations In America By Tta | Sakshi
Sakshi News home page

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ, దసరా సంబురాలు

Published Wed, Oct 5 2022 1:46 PM | Last Updated on Wed, Oct 5 2022 2:14 PM

Bathukamma Dasara Celebrations In America By Tta - Sakshi

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) ఏళ్ళ తరబడి అమెరికాలో చాటుతున్న సంగతి తెలిసిందే. టీటీఏ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి అధ్యక్షతన అమెరికాలోని నలుమూలల మిన్నంటే సంబురాలతో బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
న్యూయార్క్ నగరంలో.. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) ఫౌండర్ డా. పైళ్ల మల్లారెడ్డి, సొంత నగరమైన న్యూయార్క్ లో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. లాంగ్ ఐలాండ్లోని రాడిసన్ హోటల్ లో రెండు వేలకు పైగా అతిథులతో బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

సర్వాంగ సుందరంగా అలంకరించిన వేదికను అమ్మవారు అధిరోహించగా భక్తిశ్రద్ధలతో సాగిన లలిత పారాయణం, న్యూ యార్క్ ఆడపడుచుల ఆటపాటలు, నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ఈ వేడుకలు జరిగాయి. సహచర సంఘమైన న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) తోడ్పాటు అందించాయి. ఈ వేడుకలలో అతిథులు ఉత్సాహంగా రూపొందించి తీసుకొచ్చిన బతుకమ్మలను ఒక్క చోట అలంకరించి బెస్ట్ బతుకమ్మ పోటీలు నిర్వహించారు. బాణసంచాల వెలుగులలో కోలాహలంగా బతుకమ్మ నిమజ్జనం జరిగింది.

న్యూ జెర్సీ నగరంలో ..టీటీఏ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి సొంత రాష్ట్రం, అమెరికాలోనే అతి ఎక్కువ తెలంగాణ, తెలుగు వారు నివసించే న్యూ జెర్సీ నగరంలో బతుకమ్మ సంబురాలు మిన్నంటాయి. ప్రతి ఏడాది అమెరికాలోనే అతి పెద్దది, అరుదైన బంగారు బతుకమ్మను న్యూజెర్సీ టీటీఏ సభ్యులు చాలా గొప్పగా బంగారు బతుకమ్మను పేర్చారు.

అంగరంగ వైభవంగా ఉడ్రో విల్సన్ మిడిల్ స్కూల్లో సుమారు రెండు వేల మంది తెలంగాణ ఆడపడుచులు జోరు వానలో సైతం బతుకమ్మలతో వేదికకు తరలి వచ్చారు. 

ఇండియానాపోలిసులో ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వెస్ట్ఫిల్డ్ నగరంలోని కారి రిడ్జ్ ఎలిమెంటరీ స్కూల్ నందు తెలంగాణ తెలుగు మహిళలంతా షుమారు వెయ్యి మందికి పైగా బతుకమ్మలను పేర్చి తెచ్చి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించారు. ఇండియానాపోలీసులో ఇంత పెద్ద ఎత్తున బతుకమ్మ జరగటం ఇదే మొధటిసారి. జనం నలుమూలల నుంచి పోటెత్తారు.

డెట్రాయిట్ నగరంలో.. టీటీఏ ఆధ్వర్యంలో షుమారు అయిదు వందల మంది మహిళామణులు చేరి అమ్మవారిని గౌరి పూజ, కోలాటాలతో, బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. శనివారం సాయంత్రం మూడు గంటలకు ప్రారంభమైన ఉత్సవాలు ఎనిమిది గంటలవరకు వివిధ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు, బంగారు బతుకమ్మలను పేర్చి తెచ్చి పాల్గొన్న డెట్రాయిట్ ఆడపడుచులందరికి చక్కటి విందు భోజనం ఏర్పాటు చేశారు.

సియాటెల్ నగరంలో.. వాషింగ్టన్ లోని సియాటెల్ (పసిఫిక్ వాయవ్యం) నగరంలో టీటీఏ నిర్వహించే ప్రతి ఏటా బతుకమ్మ సంబురాలకు సియాటెల్ ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తారు. వంద తెలంగాణా తీన్మార్ డప్పులతో బతుకమ్మ అమ్మవారిని ఊరేగిస్తూ వేదిక, నార్త్ క్రీక్ మిడిల్ స్కూల్ లో, బోతెల్ సిటీ కి తీసుకు వచ్చారు. అనంతరం దుర్గ పూజ, కోలాటాలు, బతుకమ్మ ఆట పాటలతో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. షుమారు వెయ్యి మంది మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.

గ్రేటర్ ఫిలడెల్ఫియా లో.. ఆలెన్టౌన్ లో బతుకమ్మ సంబరాలు ..తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ ఆధ్వర్యంలో ఆలెన్ టౌన్ లోని శ్రీ వరదరాజులు స్వామి ఆలయంలో షుమారు మూడు వందల కుటుంబాలు పాల్గొని చక్కని వాతావరణంలో అమ్మవారి బతుకమ్మ సంబురాలు జరుపుకున్నారు. గౌరి పూజతో అమ్మవారిని కొలిచి బంగారు బతుకమ్మలను పేర్చి కోలాటాలతో అమ్మవారి ఆట పాటలతో సందడిగా జరిగింది. 

బోస్టన్‌లో .. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూ ఇంగ్లాడులోని శివ టెంపుల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగింది. షుమారు వెయ్యి మంది మహిళలు అమ్మవారిని అలంకరించి తీసుకొచ్చారు. గౌరి పూజతో అమ్మవారిని కొలిచి బంగారు బతుకమ్మలను పేర్చి కోలాటాలతో అమ్మవారి ఆట పాటలతో సందడిగా జరిగింది. 

కాలిఫోర్నియాలో.. కాలిఫోర్నియా లోని బే ఏరియా లో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జానపద బతుకమ్మ సంబరాలు మౌంటెన్ హౌస్ హై స్కూల్ నందు ఆట పాటలతో అమ్మవారి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. గౌరి పూజతో అమ్మవారిని కొలిచి బంగారు బతుకమ్మలను పేర్చి కోలాటాలతో అమ్మవారి ఆట పాటలతో సందడిగా జరిగింది.

హూస్టన్ నగరంలో.. ఇండియా హౌస్ లో షుమారు మూడు వేల మంది ఆహుతులతో టీటీఏ హూస్టన్ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. జానపద బతుకమ్మ ఆట పాటలతో అమ్మవారి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. గౌరి పూజతో అమ్మవారిని కొలిచి బంగారు బతుకమ్మలను పేర్చి కోలాటాలతో అమ్మవారి ఆట పాటలతో సందడిగా జరిగింది. 

కన్సాస్ నగరంలో.. కన్సాస్ లోని హిందూ టెంపుల్ అఫ్ కన్సాస్ లో షుమారు వెయ్యి మంది ఆహుతులతో టీటీఏ కన్సాస్ బతుకమ్మ సంబరాలు స్థానిక సంస్థలతో కలిపి ఘనంగా నిర్వహించింది. జానపద బతుకమ్మ ఆట పాటలతో అమ్మవారి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. గౌరి పూజతో అమ్మవారిని కొలిచి బంగారు బతుకమ్మలను పేర్చి కోలాటాలతో అమ్మవారి ఆట పాటలతో సందడిగా జరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement