డెట్రాయిట్: మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏడవ వర్థంతి కార్యక్రమాన్ని అమెరికాలోని డెట్రాయిట్‌లో నిర్వహించారు. ఎన్‌ఆర్ఐ వైఎస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానకి హాజరైన ఎన్‌ఆర్ఐ వైఎస్ఆర్ సీపీ నేతలు మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనితరసాధ్యమైన నాయకత్వాన్ని గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ఆర్ చేసిన సేవలను కొనియాడారు. పేదలు, మహిళలు, రైతులకోసం వైఎస్ఆర్ ఎంతగానో పాటుపడ్డారని.. తద్వారా కోట్లాదిమంది హృదయాల్లో ఆయన నిలిచిపోయారని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను హామీలతో మోసగించి అధికారం చేపట్టి ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఎన్ఆర్ఐ వైఎస్ఆర్‌సీపీ నేతలు విమర్శించారు. వైఎస్ఆర్ ఆశయాలు నెరవేరాలంటే వైఎస్ జగన్ను అధికారంలోకి రావాలని, అప్పుడే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని వక్తలు వెల్లడించారు.
డెట్రాయిట్‌లో మహానేత వర్థంతి
Published Mon, Sep 12 2016 10:30 PM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM
Advertisement
Advertisement