
50 మీటర్లు వదలాలంటే.. స్థలమే మార్చేస్తారా?
మెట్రో రైల్ భూముల కేటాయింపు వివాదంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అంశాన్ని తెరపైకి తెచ్చారు.
మెట్రో వివాదంపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: మెట్రో రైల్ భూముల కేటాయింపు వివాదంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అంశాన్ని తెరపైకి తెచ్చారు. మైహోమ్స్ అధినేత రామేశ్వర్‌రావుకు చెందిన ఆక్వా స్పేస్ డెవలపర్స్‌కు తొలుత ఇచ్చిన భూమిలో అరుదైన పురాతన శిలాసంపద ఉండడంతో.. 50 మీటర్ల భూమిని వదిలి అక్కడే నిర్మాణాలు చేసుకోవచ్చంటూ సాంకేతిక కమిటీ చెప్పిందని ఆయన వెల్లడించారు. అలాంటప్పుడు ఆక్వా స్పేస్‌కు భూమిని మరో చోట కేటాయించాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు. ఈ మేరకు 50 మీటర్ల భూమిని వదిలి అక్కడే నిర్మాణాలు చేసుకోవచ్చంటూ సాంకేతిక కమిటీ ఇచ్చిన నివేదికను రేవంత్ బుధవారం ఎన్టీఆర్ భవన్‌లో మీడియాకు బహిర్గతం చేశారు.
రాయదుర్గంలోని ఏపీఐఐసీ భూముల అభివృద్ధికి సంబంధించి సాంకేతిక కమిటీ ఇచ్చిన నివేదికలో ఆక్వా స్పేస్‌కు ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలని ఎక్కడా చెప్పలేదన్నారు. వేల కోట్ల విలువైన భూమిని సన్నిహితుడైన కారణంగానే రామేశ్వర్‌రావుకు సీఎం కేసీఆర్ కేటాయించారని.. దీనిపై వెంటనే మంత్రి కేటీఆర్ చర్చకు రావాలని సవాలు చేశారు. మెట్రోరైలు వివాదంలో టీడీపీలో చిచ్చురేగి ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రచారంపై రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... ‘మా దయన్న లా నేను అమాయకుడిని కాదు. మోసపోవడానికి’ అని పేర్కొనడం గమనార్హం.