రేవంత్‌కు వేణుగోపాలచారి సవాల్
సాక్షి, హైదరాబాద్: మెట్రో భూముల్లో వాస్తవాలపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్.వేణుగోపాలచారి సవాల్ చేశారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో శనివారం వేణుగోపాలచారి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు జరిపిన కేటాయింపులను ఆధారం చేసుకుని తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మంచిది కాదని హెచ్చరించారు. అబద్ధాలు, అసత్యాలను పదేపదే చెబుతూ ఉంటే నమ్ముతారనే సిద్ధాంతంతో రేవంత్ నోటికొచ్చిన విమర్శలను చేస్తున్నాడన్నారు. మెట్రో భూములను కొందరు వ్యక్తులకు తెలంగాణ ప్రభుత్వం ధారాదత్తం చేసినట్టుగా వస్తున్న ఆరోపణలను ఖండించారు. రేవంత్ చెబుతున్న వాటిలో వాస్తవాలుంటే బహిరంగచర్చలో తేల్చుకుందామని సవాల్ చేశారు.
బహిరంగ చర్చకు సిద్ధమేనా..?
Published Sun, Sep 21 2014 3:19 AM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM
Advertisement
Advertisement