వారసత్వ ఉద్యోగాలు కొనసాగించాలి
గోదావరిఖని, న్యూస్‌లైన్ : రాబోయే తెలంగాణ రాష్ర్టంలో సిం గరేణి విస్తరించిన నాలుగు జిల్లాల పరిధిలో నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు సంస్థలో వారసత్వ ఉద్యోగాలను తిరిగి కొనసాగిం చాలని ముథోల్ ఎమ్మెల్యే ఎస్.వేణుగోపాలచారి డిమాండ్ చేశారు. గోదావరిఖనిలోని సింగరేణి ఆర్జీ-1 కమ్యూనిటీహాల్లో ఆది వారం నిర్వహించిన హెచ్ఎంఎస్ అనుబం ద సింగరేణి మైనర్స్ అండ్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ 13వ మహాసభలకు ఆయన హాజరై మాట్లాడారు.
తెలంగాణలో వనరులు పుష్కలంగా ఉన్నాయని, ఒక్క ఖమ్మం జిల్లాలోనే 30 రకాల ఖనిజాలున్నాయని ఆయన తెలిపారు. అయితే సీమాం ధ్రులకు భద్రాచలంలోని రాముని హుండీ మీద కన్నా ఈ ఖనిజ సంపదపైనే ఎక్కువ గా కన్నేశారని, అందుకే భద్రాచలాన్ని సీ మాంధ్రలో కలపాలనే కుట్ర పన్నుతున్నార ని ఆయన పేర్కొన్నారు. కాగా సింగరేణిలో రాజకీయాలకతీతంగా సాగుతున్న హెచ్ ఎంఎస్‌ను కార్మికులు ఆదరించాలని, రాబో యే ఎన్నికల్లో సింగరేణిపై యూనియన్ జెం డా ఎగురవేసేలా ప్రతీ కార్యకర్త పనిచేయాలన్నారు.
బీఎంఎస్ నాయకుడు పులి రాజి రెడ్డి మాట్లాడుతూ దేశంలో పెట్టుబడిదారి, కాంగ్రెస్ కార్మిక సంఘాల బారి నుంచి కా ర్మికులను కాపాడేందుకు సామ్యవాద ధోరణితో జయప్రకాశ్ నారాయణ్ హెచ్ఎంఎస్ ను ప్రారంభించారని, అది నేడు దేశంలోని రైల్వే, సింగరేణి, ఇతర పబ్లిక్ సెక్టార్ పరిశ్రమల్లో కీలకభూమిక పోషిస్తున్నదని తెలిపా రు. జేఏసీ నాయకుడు డాక్టర్ శంకర్ముది రాజ్ మాట్లాడుతూ సింగరేణి పునర్నిర్మాణంలో కార్మికులు భాగస్వామ్యులు కావాల ని కోరారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అధ్యక్షతన నిర్వహించిన సభలో నాయకులు కర్ర యాదవరెడ్డి, సీ హెచ్ ఉపేందర్, గోమాస శ్రీనివాస్, యాదగిరి సత్తయ్య, దేవ వెంకటేశం, ప్రతాపరావు, కొలిపాక వీరస్వామి, షబ్బీర్ అహ్మ ద్, నాయిని ఓదెలు, ద శరథం, మంథని మల్లేశ్, కె.బాలయ్య, తదితరులు పాల్గొన్నా రు. అంతకుముందు యూనియన్ జెండా ను అధ్యక్షుడు నాయిని నర్సింహరెడ్డి ఆవి ష్కరించారు. సభ ప్రారంభానికి ముందు ఇటీవల అమరుడైన నెల్సన్మండేలా మృ తిపై నాయకులు, కార్యకర్తలు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటిం చారు. అలాగే సభలో కళాకారులు ఆలపిం చిన గీతాలు అలరించాయి.
సీనియర్ కార్యకర్తకు సన్మానం
సింగరేణిలో హెచ్ఎంఎస్ ప్రారంభమైన 1978 నుంచి పనిచేస్తూ కార్మికుల సమస్యల కోసం పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన రాంచంద్రం అనే సీనియర్ కార్యకర్తను యూనియన్ అధ్యక్షుడు నాయిని నర్సింహరెడ్డి, రియాజ్ అహ్మద్ పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించారు.
యైటింక్లయిన్‌కాలనీ : హెచ్ఎంఎస్ మహాసభకు పట్టణం నుంచి కార్యకర్తలు బైక్ ర్యాలీ గా తరలివెళ్లారు. దశరథంగౌడ్, రామయ్య, గోపాల్‌రెడ్డి, హబీబ్‌బేగ్ పాల్గొన్నారు.