
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, ఈ క్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం రాష్ట్ర శాసనసభ విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌కు సైతం ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, మంత్రివర్గ విస్తరణ ఎన్నికల కోడ్ పరిధిలోకి రాదని రేవంత్‌రెడ్డికి తెలిపామని రజత్‌కుమార్ పేర్కొన్నారు.