సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై వివిధ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌పై టీఆర్‌ఎస్‌లో సంతృప్తి వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్ అనుకున్నట్లుగానే 16 స్థానాల్లో ఆ పార్టీ గెలు స్తుందని అధిక శాతం సంస్థల ఎగ్జిట్ పోల్స్ సర్వే లు అంచనా వేశాయి. రెండు, మూడు సంస్థలు మాత్రమే టీఆర్‌ఎస్‌కు ఒకట్రెండు స్థానాలు తక్కువగా వస్తాయని పేర్కొన్నాయి. దీంతో లోక్‌సభ ఎన్నికల ఫలితాల సరళి పూర్తిగా తమకు అనుకూలంగా ఉంటుందని టీఆర్‌ఎస్ ధీమాగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ సరళిపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేర్వేరుగా పలువురు నేతలతో చర్చిం చారు.
అనుకున్నట్లుగానే ఆశించిన స్థానాల్లో గెలుస్తున్నామని చెప్పారు. ఫలితాల అనంతరం కేంద్రంలో కీలకపాత్ర పోషించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. గత ఎన్నికల్లో వచ్చినట్లుగా బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదని.. కాంగ్రెస్ మెజారిటీకీ చాలా దూరంగా ఉంటుందని చెప్పారు. రెండు ప్రధాన జాతీయ పార్టీలు ఈ పరిస్థితుల్లో ఉండటంతో ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక కేంద్ర రాజకీయాల్లో సమీకరణలు మారతాయని, టీఆర్‌ఎస్ కీలకపాత్ర పోషించే పరిస్థితులు ఉంటాయని సీఎం కేసీఆర్ ధీమాతో ఉన్నారు. ఇతర ప్రాంతీయ పార్టీలు గెలుచుకునే సీట్ల సంఖ్య ఆధారంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment