రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : అరెస్ట్‌లతో కాంగ్రెస్ ప్రభంజనాన్ని టీఆర్‌ఎస్ అడ్డుకోలేదని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి అరెస్ట్‌పై ఆయన ట్విటర్‌లో స్పందించారు. కేసీఆర్ నిరంకుశ ధోరణికి పరాకాష్టే రేవంత్ రెడ్డి అరెస్ట్ అని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, ఓటమి భయం వల్లే రేవంత్‌ను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ను ప్రజలు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
మంగళవారం కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ దృష్య్టా రేవంత్ నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా.. పోలీసులు ముందుస్తుగా తెల్లవారుజామున ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్‌పై నిరసనలు తలెత్తడంతో ఆయనను విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ డీజీపీని ఆదేశించారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఆయనను జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి కొడంగల్‌కు తరలించారు.
అరెస్టులతో కాంగ్రెస్ ప్రభంజనాన్ని టీఆర్‌ఎస్ అడ్డుకోలేదు. కేసీఆర్ నిరంకుశ ధోరణికి పరాకాష్టే రేవంత్‌రెడ్డి అరెస్ట్. టీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక పాలనకు రోజులు దగ్గర పడ్డాయి. ఓటమి భయం వల్లే అరెస్ట్ చేశారు. టీఆర్‌ఎస్‌ను ప్రజలు చిత్తుగా ఓడించి కేసీఆర్‌కు విశ్రాంతి ఇవ్వబోతున్నారు. pic.twitter.com/hViI6urOZe
— Rahul Gandhi (@RahulGandhi) December 4, 2018
చదవండి: రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి: రజత్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment