సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై తెలంగాణ ఐటీ మంత్రి కే తారక రామారావు మండిపడ్డారు. రాహుల్‌గాంధీ చెప్పే మాటలకు, ఆ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలకు మధ్య పొంతన లేదని ఎత్తిచూపారు. కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో ఏడాదికి లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతుండగా.. రాహుల్‌గాంధీ మాత్రం తాజా సభలో ఏడాదికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి లక్ష ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పుకొచ్చారు.
రాహుల్ వ్యాఖ్యల వీడియోను షేర్ చేసిన కేటీఆర్.. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరో పచ్చి అబద్ధం బహిర్గతమైంది. కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలో ఏడాదికి లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించగా.. రాహుల్ మాత్రం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలుపుకొని ఏడాదికి లక్ష ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించి.. ఏడాదికి రెండులక్షల ఉద్యోగాలను ప్రైవేటు రంగంలో కల్పిస్తున్న విషయం రాహుల్‌గాంధీకి తెలియదా? ఉద్యోగాల కల్పనను తగ్గించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారా?’ అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
Another blatant lie of @INCTelangana exposed. While @INCTelangana manifesto promises they will fill 1 Lakh Govt jobs in one year, their party president @RahulGandhi Ji contradicts and says 1 Lakh jobs in Govt & Pvt sector in one year! pic.twitter.com/Qpeyhx63dw
— KTR (@KTRTRS) 3 December 2018
Does @RahulGandhi Ji even know that TRS Govt's efforts to attract investments have created over 2 Lakh job opportunities in private sector per year? Do the Congress leaders intend to halve it?
— KTR (@KTRTRS) 3 December 2018
Comments
Please login to add a commentAdd a comment