
సీబీఐ కేసులతోనే మోదీకి దాసోహం
కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: సీబీఐ కేసుల భయంతోనే ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ మోకరిల్లుతున్నారని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
గురువారమిక్కడ ఆయన మాట్లాడుతూ తెలంగాణకు సీఎం అయ్యాక నాలుగు సార్లు కేసీఆర్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారన్నారు. కేసుల నుంచి రక్షించుకోవడానికి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారన్నారు. కేసీఆర్ వైఫల్యం వల్లనే రాష్ట్రంలో నగదు కొరత ఏర్పడి, రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని, జీఎస్టీ వల్ల రాష్ట్రంపై 20వేల కోట్ల భారం పడుతుందని చెప్పారు.