తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఇంకా.. ఆంధ్రా పెత్తనమే కావాలా..? ఆంధ్రాబాబు మోచేతి నీళ్లకు అలవాటు పడిన తెలంగాణ టీడీపీ నేతలు చరిత్ర హీనులవుతారని రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు అన్నారు.
సిరిసిల్ల: తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఇంకా.. ఆంధ్రా పెత్తనమే కావాలా..? ఆంధ్రాబాబు మోచేతి నీళ్లకు అలవాటు పడిన తెలంగాణ టీడీపీ నేతలు చరిత్ర హీనులవుతారని రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు అన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో బుధవారం బీడీ కార్మికులకు జీవనభృతి పంపిణీని చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కలిసి రాని టీడీపీ నేతలు రాష్ట్ర పునఃనిర్మాణంలో అయినా కలిసి రావాలని కోరారు. జాతీయ పార్టీలు ఎన్నో ఉండగా.. ఆంధ్రాబాబు పెత్తనం చెలాయించే టీడీపీలో కొనసాగడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ టీడీపీ నేతలు రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి, మెత్కుపల్లి చరిత్రహీనులవుతారని పేర్కొన్నారు.