
సాక్షి, హైదరాబాద్ : టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి ...కుటుంబ పాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ...‘ వచ్చే ఎన్నికల్లోనూ కేసీఆరే ముఖ్యమంత్రి. నరేంద్ర మోదీ, సోనియాగాంధీకి కూడా ఆ విషయం తెలుసు. కుంభకోణాలతో నిండిన కాంగ్రెస్‌లో మరో దొండ చేరిండు. రాహుల్ గాంధీని కుటుంబ పాలన కాదా?. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య ఎమ్మెల్యేలు కాదా?. ఓటుకు కోట్లు కేసులో రేవంత్ తెలంగాణ పరువు తీసిండు. రాహుల్ గాంధీనే మమ్మల్ని ఏం చేయలేకపోయాడు. రేవంత్ ఎంత?. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఎక్కడైనా పాల్గొన్నాడా?. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈసారి కొడంగల్‌లో టీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయం.’ అని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment