
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై హైకోర్టు న్యాయవాది రామారావు మంగళవారం సుల్తాన్‌బజార్‌లోని సీబీఐ జోనల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. రేవంత్ 18 షెల్ కంపెనీలుపెట్టి రూ.200 నుంచి రూ.300 కోట్లు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. తన బంధువుల పేర్ల మీద శ్రీసాయి మౌర్య ఎస్టేట్స్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిం చారు.
కోకాపేట్‌లోని ఓ పార్క్ భూమిని ప్రైవేట్ కంపెనీకి రూ.17 కోట్లకు అమ్మి ప్రభుత్వాదాయానికి గండికొట్టారన్నారు. తన బావమరిది సూదిని జయప్రకాశ్, మామ సూదిని పద్మారెడ్డిలను బినామీలుగా పెట్టి కంపెనీలు నడుపుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారాలపై పూర్తిగా విచారణ జరిపి రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు రామారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment