
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుల కలయిక శుభపరిణామమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డితోపాటు సీనియర్ నేతలు జానారెడ్డి, వి.హనుమంతరావు గురువారం ఢిల్లీలో చంద్రబాబును కలిశారు.
అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో కలసి పనిచేయడానికి రాహుల్, బాబు ముందుకు వచ్చారని, ప్రధాని మోదీ వ్యతిరేక కూటమి వచ్చే ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తుందని అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కలసి పనిచేయడం ద్వారా దేశానికి ఒక బలమైన నాయకత్వం అందించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment