జయశంకర్: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని విమర్శించే స్థాయి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్‌కు లేదని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ తెలిపారు. ఈ మేరకు బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోముఖ్య నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని, లేకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. గడిచిన తొమ్మిదిన్నరేళ్ల కాలంలో ఏనాడూ కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, అధికారంలోకి వచ్చాక రైతులకు రుణ మాఫీ చేస్తానన్న సీఎం కేసీఆర్, ఇప్పటి వరకు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించి, బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్, జిల్లా నాయకులు అంబాల శ్రీనివాస్, కాగితోజు రమణాచారి, గజవెల్లి అర్జున్, వెంకీ యా దవ్, మాచర్ల సంతోష్, ఫాజిల్, నారాయణ, పుల్ల మహేష్, తోట రంజిత్, నగునూరి రజినీకాంత్ గౌ డ్, చుంచుల మహేష్, బేతి పృథ్వి పాల్గొన్నారు. -కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవన్
Comments
Please login to add a commentAdd a comment