
ఉగాదితో జాతర ముగింపు..
ఐనవోలు: సంక్రాంతి రోజు కర సంక్రమనం దిష్టి కుంభం కార్యక్రమంతో ప్రారంభమైన హనుమకొండ జిల్లా ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి జాతర ఉత్సవాలు నేటి(ఉగాది)తో ముగియనున్నాయి. పూర్వం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సమయం అనువైనదిగా భావించి భక్తులు మల్లన్నకు మొక్కులు చెల్లించేవారు. ఉగాది (ఆదివారం) రోజు ఆలయంలో ఉదయం మల్లన్నకు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి నూతన వస్త్రాలు అలంకరిస్తారు. ఉగాది పచ్చడిని నైవేద్యంగా సమర్పించి భక్తులకు అందిస్తారు. సాయంత్రం పంచాంగ శ్రవణం చేయడంతో 3 నెలల పాటు సాగిన జాతర ఉత్సవాలు ముగిసినట్లు ప్రకటిస్తారు.