రంగంలోకి దిగిన దళారులు
శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 10లోu
గతంలో వందలాది మంది బాధితులు
జిల్లాకేంద్రంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు పెట్టిస్తామని, డబుల్‌బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తామని ప్రత్యక్ష్యంగా గత ప్రజాప్రతినిధులే రంగంలోకి దిగి ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు వసూళ్లకు పాల్పడ్డారు. డబ్బులు ఇచ్చిన వారిలో కొంత మందికి లబ్ధిచెందగా ఇంకా కొంత మంది బాధితులు సంబంధిత వ్యక్తుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికై నా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా.. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వర్తించేలా చేస్తామని దళారులు మోసం చేస్తున్నారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసిన ముగ్గురు వ్యక్తులపై గతంలో పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపిన ఘటనలు ఉన్నాయి.
● రూ.లక్షల్లో వసూళ్లకు ప్రణాళిక.. ● గతంతోనూ మోసపోయిన బాధితులు
2023 సంవత్సరంలో కలెక్టర్, ఎస్పీ, ఇతర ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగాలు పెట్టిస్తామని పలువురు నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేశారు. దీంతో బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్పీ స్పందించి కేసు నమోదు చేయించారు. 24మంది నుంచి సుమారు రూ.50లక్షలకుపైగా వసూలు చేశారు. 2024 జూలై 18న ఏజెన్సీ నిర్వాహకుడు శ్రీనివాసరావు, పట్టణానికి ఇద్దరు మధ్యవర్తులను అదుపులోకి తీసుకొని జైలుకు పంపించారు. ఇదే మాదిరిగా జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్లలో బాధితులు ఫిర్యాదులు చేశారు.
భూపాలపల్లి అర్బన్: అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే.. ప్రభుత్వం కొత్త పథకం అమలుకు శ్రీకారం చుట్టిందంటే చాలు.. కొందరి పంట పండినట్లే. దరఖాస్తుల స్వీకరణ మొదలునుంచే ఆశావహులను ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభిస్తుంటారు. అమాయక ప్రజలు వారి మాటలకు ఆకర్షితులై ప్రభుత్వ పథకాల్లో లబ్ధిపొందాలని లక్షలు సమర్పించి మోసపోతున్నారు. కలెక్టర్, ఎమ్మెల్యే, మంత్రులు దళారులను ఆశ్రయించవద్దని సూచించినా.. మోసపోతూనే ఉన్నారు.
గత ప్రభుత్వ హయాంలో డబుల్‌బెడ్రూం ఇళ్లు, దళితబందు, కార్పొరేషన్ లోన్లు, ఇతరత్రా పథకాల కోసం చోటా, మోటా, బడా నాయకులు లబ్ధిదారుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేశారు. కొంతమంది ప్రజాప్రతినిధులు డబ్బులు వసూలు చేసిన తర్వాత పథకాల లబ్ధి దరిచేరకపోవడంతో బాధితులు గొడవలకు దిగారు. పరువుపోవడంతో పాటు రాజకీయ భవిష్యత్ ఉండదనే భయంతో కొంతమంది వెంటనే బాధితులకు వారినుంచి వసూలు చేసిన డబ్బులను గుట్టుచప్పుడు కాకుండా ముట్టజెప్పిన ఘటనలు జిల్లాలో కోకొల్లలు ఉన్నాయి. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇంటింటి సర్వే ఇప్పటికే పూర్తయింది. అధికారులు అర్హుల ఎంపికలో తలమునకలై ఉండగా, దళారులు వసూళ్లకు తెరలేపారు. ప్రస్తుతం రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రభుత్వ లబ్ధిపొందాలనే వారిని గుర్తించి వారి ఆశలను వీరంతా సొమ్ము చేసుకుంటున్నారు. ఏ పథకం దరిచేరాలన్నా రేషన్‌కార్డు ప్రామాణికంగా ఉండటంతో జిల్లాలో రేషన్‌కార్డుల కోసం చాలామంది అర్హులు, అనర్హులు(ఉద్యోగస్తులు) దరఖాస్తు చేసుకున్నారు. కొంత మంది ఆర్థికంగా ఉన్నవారికి సైతం రేషన్‌కార్డులు ఇప్పిస్తామని రూ.10వేల నుంచి రూ.50వేల వరకు వసూలు చేస్తున్నారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో దృష్టిసారిస్తే అక్రమాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గతం నుంచీ ఇదే పరిస్థితి..
న్యూస్‌రీల్
రంగంలోకి దిగిన దళారులు


