నేడు పంచాంగ శ్రవణం
కాళేశ్వరం: ఉగాది పర్వదినం సందర్భంగా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి దేవస్ధానంలో ఆదివారం పంచాంగ శ్రవణం నిర్వహిస్తున్నట్లు ఈఓ మహేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాయంత్రం 5.30గంటలకు కార్యక్రమానికి ఆలయ అర్చకులు, వేదపండితులతో నిర్వహిస్తారన్నారు. అనంతరం తీర్థప్రసాదం అందజేస్తారని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు.
పంచాంగం ఆవిష్కరణ
భూపాలపల్లి అర్బన్: స్వస్తి శ్రీ విశ్వావసు నామ నూతన సంవత్సర పంచాంగ పుస్తకాన్ని శనివారం జిల్లాకేంద్రంలో పురోహితులు ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా సంఘం రాష్ట్ర నాయకులు సాంబయ్య, నంది విజయ్ హాజరై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిరసనగండ్ల వెంకటరమణాచార్యులు, వీరన్న, ఇంద్రపాల, సాంబశివుడు, హరిరఘశర్మ, సత్యనారాయణ, విజయ్ పాల్గొన్నారు.
ప్రజలకు
ఉగాది శుభాకాంక్షలు
భూపాలపల్లి అర్బన్: ఉగాది పండగను పురస్కరించుకొని కలెక్టర్ రాహుల్‌శర్మ జిల్లా ప్రజలకు శనివారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది తెలుగు ప్రజల సంస్కృతిని ప్రతిబింబించే గొప్ప పండుగ అని, కొత్త ఆశలతో, నూతన ఉత్సాహంతో నిండిన విశేషమైన రోజు అని తెలిపారు. జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో, శాంతి సౌభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
జ్యోతిని అభినందించిన కలెక్టర్
పలిమెల: ఇటీవల కాంబోడియాలో జరిగిన పస్ట్ ఏసియన్ పారా ఒలింపిక్స్ త్రోబాల్ పోటీలో బ్రాంజ్ మెడల్ సాధించిన కావేరి జ్యోతిని శనివారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్‌శర్మ అభినందించారు. ప్రయాణ, వసతి, శిక్షణ ఖర్చులను ప్రభుత్వం నుంచి ఇప్పించినట్లు తెలిపారు. పల్లె నుంచి ప్రతిభ కనబరిచి దేశానికి వన్నె తెచ్చిన జ్యోతిని మండల ప్రజలు, జిల్లా అధికారులు అభినందించారు.
క్రీడాకారులకు సన్మానం
భూపాలపల్లి రూరల్: జాతీయస్థాయి క్రీడా పోటీలలో పాల్గొన్న క్రీడాకారులను శనివారం ఐడీఓసీ కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యనారా యణరావు సన్మానించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి ఆలిండియా సివిల్ సర్వీసెస్‌లో పాల్గొన్న జిల్లాకు చెందిన ఫిజికల్ డైరెక్టర్స్ విజయలక్ష్మి, సీహెచ్ ఆనంద్, జాతీయ స్థాయి సైక్లింగ్ కోచ్‌గా ఎంపికై జాతీయ స్థాయిలో కోచింగ్ ఇచ్చిన మమత ఫిజికల్ డైరెక్టర్లను ఎమ్మెల్యే గండ్ర శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి చిర్ర రఘు పాల్గొన్నారు.
ఈద్గాలో రంజాన్ ఏర్పాట్లు
భూపాలపల్లి అర్బన్: రంజాన్ పండగను పురస్కరించుకొని పట్టణ శివారులోని ఈద్గాలో చేపడుతున్న ఏర్పాట్లను శనివారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పరిశీలించారు. ముస్లింల పవిత్ర రంజాన్ పండుగ నమాజు కోసం అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఈద్గా ప్రాంగణాన్ని వాటర్ ట్యాంకర్ ద్వారా శుభ్రం చేస్తూ చుట్టు పరిసరాల్లో చెత్తను తొలగించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్‌స్పెక్టర్ నవీన్‌కుమార్, పర్యావరణ ఇంజనీర్ దేవేందర్, జామ మసీదు అబ్బాసియా మసీద్ నాయకులు పాల్గొన్నారు.
నేడు పంచాంగ శ్రవణం
నేడు పంచాంగ శ్రవణం


