
మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట
కాళేశ్వరం: కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మహదేవపూర్ మండలకేంద్రంలోని జామా మసీదులో శనివారం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లింలకు పండ్లు తినిపించి దీక్ష విరమింపచేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మైనార్టీ మహిళలకు, యువతకు స్వయం ఉపాధి పొందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని మసీదుల అభివృద్ధికి, సంక్షేమానికి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో మైనార్టీలతో పాటు ఇతర వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. మైనార్టీ సోదర సోదరీమణులకు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాశ్‌రెడ్డి, మహదేవపూర్ డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ, ముస్లిం మతపెద్దలు గయాజ్‌ఖాన్, తాజోద్దీన్, సలామోద్దీన్, మజీద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోట రాజబాపు, అక్భర్‌ఖాన్, అస్రర్, శకీల్, తాజ్, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతి, మాజీ ఎంపీపీ రాణిబాయి, అజీంఖాన్, శశిభూషన్‌కాచే పాల్గొన్నారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
దుద్దిళ్ల శ్రీధర్‌బాబు