
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్‌లో.. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి..నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా. ఎన్డీఎస్ఎ సూచన మేరకు అన్నారం, సుందిళ్లలోనీటిని నిల్వ చేయకపోయినా.. కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండింది.
ఇది తెలంగాణ రైతుల ఘనత.. వారి శ్రమ, చెమట, కష్టం ఫలితం.. తెలంగాణ రైతు దేశానికే గర్వకారణం.. ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి హృదయపూర్వక అభినందనలు’ అంటూ సీఎం రేవంత్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment