తెలంగాణ సెంటిమెంట్‌.. కేసీఆర్‌ చేతిలో పాము | Revant Reddy fires on KCR in Visakha Mahanadu | Sakshi
Sakshi News home page

తెలంగాణ సెంటిమెంట్‌.. కేసీఆర్‌ చేతిలో పాము

Published Tue, May 30 2017 1:38 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

తెలంగాణ సెంటిమెంట్‌.. కేసీఆర్‌ చేతిలో పాము - Sakshi

తెలంగాణ సెంటిమెంట్‌.. కేసీఆర్‌ చేతిలో పాము

పాములా డించి డబ్బులు దండుకునే పాము లోడిలా తెలంగాణ సెంటి మెంట్‌ ను కేసీఆర్‌ వాడుకుంటున్నారని

విశాఖ మహానాడులో రేవంత్‌రెడ్డి ధ్వజం
సాక్షి, విశాఖపట్నం: పాములా డించి డబ్బులు దండుకునే పాము లోడిలా తెలంగాణ సెంటి మెంట్‌ ను కేసీఆర్‌ వాడుకుంటున్నారని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమ ర్శించారు. ఏపీలోని విశాఖలో జరుగుతున్న టీడీపీ మహానాడులో సోమవారం రేవంత్‌ ప్రసంగించారు. ఎన్నికల హామీలను కేసీఆర్‌ మర్చిపోయారని, ప్రజలెవరూ కలవకుండా తన పదెకరాల ‘గడి’లో అనుచరులతో భజన చేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఏర్పడిన 1,100 రోజుల్లో 3,300 మంది రైతులు ఆత్మహత్యలు చేసు కున్నా రని, కేసీఆర్‌ పాలన ఎంత అధ్వానంగా ఉందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం లేదన్నారు.

తెలంగాణ సాధన కోసం 1,200 మంది ఆత్మ బలి దానం చేసుకుంటే ఇంతవరకు 500 మంది వివరాలే సేక రించా రని, అమరుల పట్ల కేసీఆర్‌కు ఎంత గౌరవం ఉందో దీన్ని బట్టే అర్థమవుతోందన్నారు. తెలంగాణ వస్తే సమగ్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడు గొర్రెలు, బర్రెలిస్తే పెంచు కోమంటున్నారని, డిగ్రీలు పీజీలు చదివిన వాళ్లు మళ్లీ పాత పనులే చేసుకోవాలా అని ప్రశ్నించారు. గిరిజనులకు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్‌ ఇప్పుడు ప్రధాని మోదీ రాజ్యాంగ సవరణ చేస్తే ఇస్తామంటూ బుకాయిస్తు న్నారన్నారు. lబాబు ఉదారత వల్లే తెలం గాణలో కరెంటు కోతల్లేవని, రైతులు పంట లు పండించుకుంటున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement