
ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
సాక్షి,హైదరాబాద్/హిమాయత్‌నగర్: హెచ్‌సీయూ భూము లను పరిశీలించడానికి బీజేపీ ఎమ్మెల్యేలు వెళతారన్న ముందస్తు సమాచార నేపథ్యంలో వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేఎల్‌పీ నేత మహేశ్వర్‌రెడ్డిని ఆయన నివాసంలో హౌస్‌అరెస్ట్ చేశారు. హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను పోలీసులు చుట్టుముట్టి అక్కడకు వచ్చిన ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, ధన్‌పాల్ సూర్యనారాయణ, నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి సమీప పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రాబోయే రోజుల్లో ఓయూ, కేయూ భూములు కూడా అమ్ముతారేమో: ఏలేటి
ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ, రాబోయే రోజుల్లో ఉస్మానియా, కాకతీయ వర్సిటీల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మేయాలని చూస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ‘తెలంగాణలో అరాచక పాలన నడుస్తోంది. భూములు అమ్మితే కానీ ప్రభుత్వం నడవని పరిస్థితి. రియల్ ఎస్టేట్ దందా చేయడానికే ఈ ప్రభుత్వం ఉందా’అని ఏలేటి ప్రశ్నించారు. మంగళవారం హెచ్‌సీయూ సందర్శనకు వెళుతున్న తన హౌస్‌అరెస్ట్, బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్‌ను ఆయన ఖండించారు.
వెంటనే అఖిలపక్ష బృందాన్ని హెచ్‌సీయూకు తీసుకెళ్లి చూపించాలని డిమాండ్ చేశారు. ‘త్వరలో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలను సందర్శిస్తాం. వర్సిటీల భూముల జోలికి వెళితే సహించేది లేదు. భూముల వేలం ఆపడానికి ఉద్యమిస్తాం’అని హెచ్చరించారు. కాంగ్రెస్ మిత్రపక్ష నేతలైన ప్రొఫెసర్ కోదండరామ్, కూనంనేని సాంబశివరావులకు హెచ్‌సీయూ భూముల వివాదం కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
వేలాన్ని వెనక్కి తీసుకోవాలి: పాయల్ శంకర్
హెచ్‌సీయూ భూము ల వేలాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసు కోవాలని బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో ఎమ్మె ల్యే ధన్‌పాల్ సూర్యనా రాయణ గుప్తాతో కలి సి ఆయన మీడియాతో మాట్లాడారు ‘ధరణి పేరుతో నాడు కేసీఆర్ దోపిడీ చేశారు. భూమాత పేరుతో నేడు కాంగ్రెస్ భూ దందా చేయడానికి ప్రయ త్నిస్తోంది’అని ఆరోపించారు. హెచ్‌సీయూ భూములపై వాస్తవ పరిస్థితు లకు తెలుసుకుందామని వెళుతుంటే పోలీసులు తమను నిర్బంధించారని, అణచివేత ప్రజాపాలన అవుతుందా అని పాయల్‌శంకర్ ప్రశ్నించారు.