'ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయ్'
హైదరాబాద్: అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలనుకుంటే ముందుగా ఎన్నికల ఖర్చును తగ్గించుకోవాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు రూ. 5 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాయని, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
పెద్ద నోట్ల రద్దుతో టెర్రరిజం అదుపులోకి వస్తుందని చెప్పారని అయితే అలాంటిదేమీ జరగలేదని ఆక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. 'ఇప్పటికే బ్యాంకుల్లో 13 లక్షల కోట్లు డిపాజిట్ అయ్యాయి. ఆయా బ్యాంకుల వద్ద రూ. 4 లక్షల కోట్ల పైచిలుకు కరెన్సీ ఉంది. రూ. 17 లక్షల కోట్లు లెక్క తేలాక ఇక బ్లాక్ మనీ ఎక్కడుంది' అని ఆయన ప్రశ్నించారు.