
తాండూరు : ‘కేంద్రంలోని చాయ్‌వాలానే వదలలేదు.. మమ్మల్ని విమర్శిస్తే కారు టైర్లు ఊడిపోతాయ్’ అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ టీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సోమవారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంఐఎం కేవలం ముస్లింల పార్టీయే కాదన్నారు. అన్ని వర్గాల కోసం తమ పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు. సీఏఏ అమలుతో ముస్లింలకే కాకుండా హిందువులు, సిక్కులు, క్రైస్తవులకూ ఇబ్బందులు తప్పవని తెలిపారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా తాము తొలి నుంచి పోరాటం చేస్తున్నామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని అక్బరుద్దీన్ విమర్శించారు. ఎంఐఎంను పాతబస్తీ పార్టీ అంటూ విమర్శించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ నుంచి తన కొడుకును గెలిపించుకోలేని అసమర్థుడని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ హాదీ షహేరీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment