
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం సీనియర్ నాయకుడు, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం క్షీణించింది. గతంలో చందాయణగుట్ట సమీపంలో అక్బరుద్దీన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి నుంచి తృటిలో ప్రాణాలతో అక్బరుద్దీన్ బయటపడినా.. అప్పట్లో తీవ్ర గాయాలు కావడంతో ఆయన ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆకస్మికంగా అక్బరుద్దీన్ ఆరోగ్యం క్షీణించినట్టు తెలుస్తోంది. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను లండన్ ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. సోదరుడు అక్బర్ త్వరగా కోలుకోవాలంటూ దేవుడిని ప్రార్థించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ శ్రేణులు, అభిమానులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment