
సాక్షి, హైదరాబాద్: చాంద్రాయణగుట్ట అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందిన ఎంఐఎం కీలక నేత అక్బరుద్దీన్ ఒవైసీ శనివారం ఎమ్మెల్యేగా ప్రమా ణం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో అక్బరుద్దీన్ ఉర్దూలో దైవసాక్షిగా ప్రమా ణం చేశారు. డిప్యూటీ స్పీకర్ తిగుళ్ల పద్మారావుగౌడ్, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతేడాది డిసెంబర్ 11న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి ఆయన విదేశాల్లో ఉండడంతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేకపోయారు.