పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్‌ ఓవైసీ | Akbaruddin Elected As Chairman Of The Public Relations Committee | Sakshi
Sakshi News home page

పీఏసీ చైర్మన్‌గా ఏఐఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్‌

Published Mon, Sep 23 2019 4:00 AM | Last Updated on Mon, Sep 23 2019 4:57 AM

Akbaruddin Elected As Chairman Of The Public Relations Committee - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల చివరి రోజున ఉమ్మడి సభా కమిటీలను మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.13 మంది చొప్పున సభ్యులుండే పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ (పీఏసీ), పబ్లిక్‌ ఎస్టిమేట్స్‌ కమిటీ (పీఈసీ), పబ్లిక్‌ అండర్‌టేకింగ్స్‌ కమిటీ (పీయూసీ)ల సభ్యుల వివరాలను వెల్లడించారు. ప్రజా పద్దుల కమిటీ చైర్మన్‌గా ఏఐఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ ఎన్నికయ్యారు. అంచనాల కమిటీ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి వ్యవహరిస్తారు. గత శాసనసభలోనూ అంచనాల కమిటీ చైర్మన్‌గా వ్యవహరించిన రామలింగారెడ్డి వరుసగా రెండో పర్యాయం అదే పదవిని చేపట్టనున్నారు. పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఎన్నికయ్యారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ యూజర్స్‌ కమిటీ సభ్యులుగా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ నామినేట్‌ అయ్యారు. 

వివిధ కమిటీల్లోని సభ్యుల వివరాలు 

పీఏసీ..
చైర్మన్‌: అక్బరుద్దీన్‌ ఒవైసీ (చాంద్రాయణగుట్ట), సభ్యులు: జైపాల్‌యాదవ్‌ (కల్వకుర్తి), రవీంద్రకుమార్‌ నాయక్‌ (దేవరకొండ), బిగాల గణేశ్‌గుప్తా (నిజామాబాద్‌ అర్బన్‌), గ్యాదరి కిషోర్‌ (తుంగతుర్తి), విఠల్‌రెడ్డి, పెద్ది సుదర్శన్‌ రెడ్డి (నర్సంపేట), శ్రీధర్‌బాబు (మంథని), సండ్ర వెంకట వీరయ్య (సత్తుపల్లి), ఎమ్మెల్సీలు: పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సుంకరి రాజు, సయ్యద్‌ జాఫ్రీ, డి.రాజేశ్వర్‌రావు. 

పీఈసీ..
చైర్మన్‌: సోలిపేట రామలింగారెడ్డి (దుబ్బాక), సభ్యులు: కోనేరు కోనప్ప (సిర్పూర్‌ కాగజ్‌నగర్‌), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్‌), మాధవరం కృష్ణారావు (కూకట్‌పల్లి), మాగంటి గోపీనాథ్‌ (జూబ్లీహిల్స్‌), ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (జనగామ), జాజుల సురేందర్‌ (ఎల్లారెడ్డి), తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (సంగారెడ్డి), రాజాసింగ్‌ (గోషామహల్‌), ఎమ్మెల్సీలు: మీర్జా ఉల్‌ హసన్‌ ఎఫెండీ, భూపాల్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, ఆకుల లలిత. 

పీయూసీ..
చైర్మన్‌: ఆశన్నగారి జీవన్‌రెడ్డి (ఆర్మూరు), సభ్యులు: కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు (కోరుట్ల), ప్రకాశ్‌గౌడ్‌ (రాజేంద్రనగర్‌), అబ్రహాం (ఆలంపూర్‌), శంకర్‌నాయక్‌ (మహబూబాబాద్‌), దాసరి మనోహర్‌ రెడ్డి (పెద్దపల్లి), నల్లమోతు భాస్కర్‌రావు (మిర్యాలగూడ), అహ్మద్‌ పాషా ఖాద్రి (యాకుత్‌పురా), కోరుకంటి చందర్‌ (రామగుండం), ఎమ్మెల్సీలు: నారదాసు లక్ష్మణ్‌రావు, పురాణం సతీశ్, జీవన్‌రెడ్డి, ఫారూక్‌ హుస్సేన్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement