
సాక్షి, హైదరాబాద్: వచ్చే బడ్జెట్‌లో మైనార్టీ సంక్షేమానికి రూ.4,100 కోట్లు కేటాయిం చాలని మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులను ఈ ఆర్థిక ఏడాది ముగిసే లోపు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో కోరారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలతో సమంగా మైనార్టీలకు సంక్షేమ పథకాలను వర్తింపజేయడం అభినందనీయమన్నారు. మైనార్టీలకు కేటాయించిన నిధుల విడుదల, వ్యయంలో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014–15 నుంచి 2017–18 వరకు రూ. 4,613.85 కోట్లు కేటాయించగా రూ.2,330 కోట్లను మాత్రమే ఖర్చు చేసినట్లు చెప్పారు. షాదీ ముబారక్ పథకం కింద ఇస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.75,116 నుంచి రూ.1,00,116 కు పెంచాలని ప్రతిపాదించారు.
Comments
Please login to add a commentAdd a comment