appealed KCR
-
రూ. 4,100 కోట్లు కేటాయించండి: అక్బర్
సాక్షి, హైదరాబాద్: వచ్చే బడ్జెట్లో మైనార్టీ సంక్షేమానికి రూ.4,100 కోట్లు కేటాయిం చాలని మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. గత బడ్జెట్లో కేటాయించిన నిధులను ఈ ఆర్థిక ఏడాది ముగిసే లోపు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలతో సమంగా మైనార్టీలకు సంక్షేమ పథకాలను వర్తింపజేయడం అభినందనీయమన్నారు. మైనార్టీలకు కేటాయించిన నిధుల విడుదల, వ్యయంలో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014–15 నుంచి 2017–18 వరకు రూ. 4,613.85 కోట్లు కేటాయించగా రూ.2,330 కోట్లను మాత్రమే ఖర్చు చేసినట్లు చెప్పారు. షాదీ ముబారక్ పథకం కింద ఇస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.75,116 నుంచి రూ.1,00,116 కు పెంచాలని ప్రతిపాదించారు. -
‘కొత్త’ పాత్రలో సీఎస్ రాజీవ్‌శర్మ!
♦ వచ్చే నెలాఖరున ముగియనున్న పదవీకాలం ♦ సేవలు వినియోగించుకోవాలని భావిస్తున్న సీఎం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సేవలను మరి కొంతకాలం వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే నెలాఖరున సీఎస్ పదవీకాలం ముగియనుంది. సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఇప్పటికే కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగం (డీవోపీటీ) రెండుసార్లు సీఎస్ పదవీకాలాన్ని పొడిగించింది. ఐఏఎస్ సర్వీసు నిబంధనల ప్రకారం ఈ ఏడాది మే 31న ఆయన పదవీ కాలం ముగిసింది. కానీ మూడు నెలల కాల పరిమితిని పొడిగిస్తూ వరుసగా రెండుసార్లు డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఆరు నెలల పాటు ఆయననే సీఎస్‌గా కొనసాగించే అవకాశాలను పరిశీలించాలని సీఎం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. కానీ ఆరు నెలలకు మించి ఐఏఎస్ అధికారుల సర్వీసును పొడిగించిన సందర్భాలు దేశంలో అరుదుగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మరో సీనియర్ అధికారికి సీఎస్ బాధ్యతలు కట్టబెట్టి.. రాజీవ్‌శర్మ సేవలను మరో తీరుగా వినియోగించుకోవాలని సీఎం యోచిస్తున్నట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనల్లో అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త జిల్లాల ఏర్పాటుతో తలెత్తిన సమస్యలను అధిగమించటంతోపాటు వాటి అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించేందుకు రాజీవ్‌శర్మ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర పునర్విభజన సమయంలో కమల్‌నాథన్ కమిటీని నియమించిన తరహాలోనే ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలన్నింటికీ మార్గదర్శకంగా ఉండేలా ఈ కమిటీని వేసే అవకాశాలున్నాయి. కొత్త సచివాలయ నిర్మాణం, జయశంకర్ స్మృతివనం, అంబేడ్కర్ విగ్రహం.. అన్నింటా ఈ కమిటీ క్రియాశీల పాత్ర పోషించనుంది.