
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆదివారం ప్రగతిభవన్‌లో కలిశారు. పాతబస్తీ లాల్ దర్వాజ్ బోనాలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిందని.. స్థలాభావం కారణంగా భక్తులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఆలయాన్ని విస్తరించాలని కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. రూ.10 కోట్ల వ్యయంతో ఆలయాన్ని అభివృద్ధి చేయాలని వినతించారు. అఫ్జల్‌గంజ్ మసీదు మరమ్మతుల కోసం రూ.3 కోట్లు మంజూరు చేయాలని సీఎం ను కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్.. మసీదు, ఆలయ అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేష్‌కుమార్‌ను ఆదేశించారు
Comments
Please login to add a commentAdd a comment