
హైదరాబాద్‌లో డ్రగ్ మాఫియా: అక్బర్
హైదరాబాద్‌లో డ్రగ్ మాఫియా పెరిగిపోయిందని, యువత పక్కదారి పడుతున్నారని ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఆవేదన వ్యక్తంచేశారు.
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో డ్రగ్ మాఫియా పెరిగిపోయిందని, యువత పక్కదారి పడుతున్నారని ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఆవేదన వ్యక్తంచేశారు. పబ్‌లలో డ్రగ్ క్యాప్సిల్స్, ఇంజెక్షన్లు విచ్చలవిడిగా ఉపయోగి స్తున్నారని, దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని కోరారు. కాగ్ రిపోర్టులను ద్రవ్య వినిమియ బిల్లు రోజే ఇవ్వడం వల్ల దాన్ని అధ్యయనం చేయడానికి సమయం ఉండటం లేదని తెలిపారు.
ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. బీసీలకు సబ్‌ప్లాన్‌ను అమల్లోకి తెచ్చేలా ఇప్పుడే చర్యలు చేపట్టాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య పేర్కొ న్నారు. బెల్ట్ షాపులతో లిక్కర్‌ను ఎక్కుగా ప్రోత్సహించడం సరికాదని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. కల్లును ప్రోత్సహించాలని కోరారు.