సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని పాతబస్తీ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. 2014 నుంచి ఇప్పటివరకు వరకు కేటాయిం పులు, ఖర్చుల విషయంలో ఇదే పరిస్థితి ఉందన్నారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ చేసిన ప్రసంగంలోని అంశాలపై స్పష్టత కోరారు.
మైనారిటీ సంక్షేమంలో భాగంగా షాదీముబారక్, విదేశీ చదువులు, వడ్డీ మాఫీ, ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, మక్కా మసీదు అభివృద్ధి, స్టడీ సర్కిళ్ల అభివృద్ధి తదితర అంశాలపై చేసిన ఖర్చు లెక్కలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ అధ్వానంగా ఉందని, పట్టించుకోవట్లేదని విమర్శించారు. 12వ తరగతి వరకు తప్పనిసరిగా తెలుగును అమలు చేయడం బాగానే ఉన్నా.. ఇతర భాషలు చదివేవారికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment