సాక్షి, హైదరాబాద్: గోషామాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరిస్తే.. తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని స్పష్టం చేశారు. ఇక రేపు(శనివారం) తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అందులో భాగంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.
అయితే దీనికి ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ వ్యవహరించునున్న నేపథ్యంలో రాజా సింగ్ చేసీ తాను ఎమ్మెల్యేగా ప్రమాణ చేయనని వ్యాఖ్యానించారు. రేపు ఉదయం బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే సమావేశం కానున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ అంతకంటే ముందు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డితో సమావేశం అయిన తర్వాత తదుపరి కార్యచరణ వెల్లడించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment