
అసీమానంద బెయిల్‌ను రద్దు చేయించాలి: అక్బరుద్దీన్
మక్కా మసీదు పేలుళ్ల నిందితుడు స్వామి అసీమానందకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల నిందితుడు స్వామి అసీమానందకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం శాసనసభ జీరోఅవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. మక్కా మసీదు పేలుళ్ల ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అసీమానందను దోషిగా తేల్చిం దని గుర్తు చేశారు. ఈ కేసులో న్యాయ విచారణ చేసిన భాస్కర్‌రావు కమిషన్ నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మక్కా మసీదు అల్లర్లలో కొందరు ముస్లిం ల మరణానికి కారణమైన అధికారే చిత్తూరు ఎస్పీగా ఉండి ఎన్‌కౌంటర్‌లకు పాల్పడ్డా రని, ఆయనపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి స్పందిస్తూ, అసిమానంద బెయిల్ రద్దు చేసేలా చర్య లు తీసుకుంటామన్నారు.
అమలుకు నోచుకోని హామీలు: సంపత్‌కుమార్, కాంగ్రెస్
జీరో అవర్‌లో కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. తన నియోజ కవర్గ పర్యటనలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొన్ని కీలక హామీలు ఇచ్చినా అవి అమలుకు నోచుకోలేదన్నారు. జోగుళాంబ గుడికి మరమ్మతులు, తుమ్మిళ్ల ఎత్తి పోతల, ఫైర్ స్టేషన్ ఏర్పాటుపై ఇచ్చిన హామీలను పట్టించుకోవడం లేదన్నారు.