చేపలు, కోతులకు ఇచ్చిన ప్రాధాన్యం వారికి ఇవ్వరా?
హైదరాబాద్: సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఎమ్‌ఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఈ విషయంపై స్పీకర్‌ను కలిసి తమ నిరసన తెలిపినట్లు ఆయన వెల్లడించారు.
'అర్హత ఉన్న లక్షలాది మందికి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదు, బకాయిలు చెల్లించడం లేదు' అని అక్బరుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జరిగిన చర్చపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. చేపలు, కోతులకు ఇచ్చిన ప్రాధాన్యం విద్యార్థుల సమస్యలకు ఇవ్వరా అని ఆయన ప్రశ్నించారు.