సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రజాపాలన పేరుతో ఆరుగ్యారంటీలకు దరఖాస్తులను నేటి నుంచి ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుల కోసం ప్రజలు కొన్ని చోట్ల బారులు తీరుతున్నారు. మరికొన్ని చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రజాపాలన ఏర్పాట్లపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా గోషామహల్, మంగళ్‌హాట్ నియోజకవర్గంలో అభయ హస్తం ప్రజాపాలన కార్యక్రమాన్ని రాజాసింగ్ పరిశీలించారు. ఈ క్రమంలో ప్రజాపాలన ఏర్పాట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వార్డు కార్యాలయాల్లో ప్రజలకు దరఖాస్తు ఫామ్స్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు దరఖాస్తులు ఇవ్వకుండా బయట జిరాక్స్ షాప్‌లో తెచ్చుకోవాలని, ఒక్కో దరఖాస్తుకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు దాఖలు కోసం మరికొన్ని రోజులు గడువు ఇవ్వాలని కోరారు.
ఇది కూడా చదవండి: పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు: భట్టి
Comments
Please login to add a commentAdd a comment