
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశజనకంగా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్‌లో శనివారం జరిగిన సనత్‌నగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఆరు గ్యారెంటీల అమలుకు లక్షా 25 వేల కోట్లు అవసరమైతే బడ్జెట్‌లో మాత్రం కేవంల రూ. 53వేల కోట్లు కేటాయించారని విమర్శించారు.
‘సీఎం రేవంత్‌రెడ్డి బుడ్డర్‌ఖాన్‌లా మాట్లాడుతున్నాడు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామనడం విడ్డూరంగా ఉంది. ప్రతి మీటరుకు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. తెలంగాణ జల హక్కులను కృష్ణాబోర్డుకు అప్పగించడాన్ని నిరసిస్తూ 13న నల్గొండలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నాం’ అని కేటీఆర్ తెలిపారు.