కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ రామ్మోహన్‌రెడ్డి ధ్వజం
బీజేపీలోకి వెళ్లే ఖర్మ రేవంత్‌కు పట్టలేదని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వ విప్, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. కేటీ ఆర్‌కు మతిభ్రమించి సీఎం రేవంత్‌రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. రామ్మోహన్‌రెడ్డి మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధులు లింగం యాదవ్, కమల్‌తో కలిసి మాట్లాడారు. చెల్లెలు కవిత జైలుకు పోయి కేసులు చుట్టుముడుతుంటే కేటీఆర్‌కు బుర్ర పనిచేయడం లేదన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను, కేటీఆర్‌ను ప్రజలు ఇంటికి పంపించారని, పార్లమెంటు ఎన్నికల్లో చేయడానికి కేటీఆర్ దగ్గర ఏమీ లేదని వ్యాఖ్యానించారు. జేబుదొంగ ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని, ప్రజల జేబులు కొట్టి దోచుకున్న రూ.వేల కోట్లను కల్వకుంట్ల కుటుంబం నుంచి కక్కిస్తామని చెప్పారు. ‘దొంగలు కాబట్టే చెల్లి తీహార్ జైల్‌లో ఉంది. నువ్వు కూడా చంచల్‌గూడ జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండు. ఫోన్‌ట్యాపింగ్ విచారణ జరుగుతుంటే నువ్వు, నీ కుటుంబం ఎందుకు వణుకుతోంది. ఫోన్ ట్యాపింగ్‌తో బెదిరించి మీరు చేసిన వసూళ్ల జాబితా వస్తుంది సిద్ధంగా ఉండు’ అని వ్యాఖ్యానించారు. బీజేపీలోకి వెళ్లాల్సిన ఖర్మ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పట్టలేదని, లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేయడం ఖాయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment