పేదలకు సొంత ఆస్తుల కల్పనపై ప్రభుత్వ దృష్టి
ఉపాధి హామీ పథకంలో పెనుమార్పులు..
మట్టి రోడ్లు, పండ్లతోటల పెంపకానికి సన్నాహాలు...
కోడ్ ముగియగానే అనుమతులు...
ఉపాధి హామీ పథకాన్ని రెండిందాలా ప్రయోజనకరంగా మలచిన ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుంది..అంతకుముందు టీడీపీ హయాంలో పథకాలను ఎంతగా భ్రషు్టపట్టించాలో అంతగానూ దిగజార్చిన దౌర్భాగ్యాన్ని ఈ రాష్ట్రం చూసింది...అందుకు ఉదాహరణ నీరు–చెట్టు వంటి పథకాలే.. తద్భిన్నంగా జగన్ ప్రభుత్వంలో ప్రజోపయోగమైన ప్రభుత్వ భవనాల నిర్మాణానికి పెద్ద పీట వేసింది..ఇప్పుడా భవనాలు ఊరూరికీ ప్రజాసేవలు అందిస్తున్నాయి.. ఇది నవ్యాంధ్రకు సరికొత్త అభ్యుదయ సంకేతంగా మారింది..
ఉపాధి హామీ పథకాన్ని పేదలకు మరింతగా అక్కరకొచ్చేలా ఆ కుటుంబాలను సమున్నతంగా ఎదిగేలా చేసే నవ్యావిష్కరణకు ప్రభుత్వం ఆలోచన చేసింది... ఇకపై ఊరూరా మట్టి రోడ్ల నిర్మాణానికి, సన్న చిన్న కారు రైతులను పండ్లతోటల పెంపకానికి ప్రోత్సహించి, ఈ పథకం కింద వాటి సాగుకు గుంతల తవ్వకం వంటి పనులను పేదలకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ఉపాధిహామీ పథకాన్ని బలోపేతం చేయాలన్న ఉన్నత లక్ష్యం దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది...ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ఆలోచనను సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది...
సాక్షి, అమరావతి: ఇకపై ఉపాధి హామీ పథకం కింద కూలీల ద్వారా చేపట్టే పనుల్లోనూ ఆయా పేద కుటుంబాల వ్యక్తిగత ఆస్తుల కల్పనకు వీలున్న పనులకే పెద్దపీట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఐదేళ్లల్లో.. ఉపాధి హమీ పథకం మెటీరియల్ కేటగిరీకి సంబంధించిన నిధులను, ఇతర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అనుసంధానం చేసి, దాదాపు అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున గ్రామ సచివాలయాల భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజీ హెల్త్ క్లినిక్ భవనాలు, డిజిటల్ లైబ్రరీ భవనాలు వంటివి.. ఊరందరికీ శాశ్వతంగా ఉపయోగపడే ఉమ్మడి ఆస్తుల నిర్మాణాలు చేపట్టిన విషయం తెలిసిందే.
కూలీల ద్వారా చేపటే పనుల్లోనూ ఆయా పేదలు ఒక పక్క పనులు చేసుకుంటూ, చేసిన పనికి రోజు వారీ కూలి డబ్బులు పొందుతున్నారు. ఇకపై ఆయా పనుల ద్వారా వారే వ్యక్తిగతంగా సొంత ఆస్తులు సైతం ఏర్పాటు చేసుకునే దిశగా ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకర చర్యలు చేపట్టింది. ప్రస్తుత ఎన్నికల కోడ్ ముగియగానే ఈ తరహాలో గ్రామాల్లో కొత్తగా పెద్ద ఎత్తున పనుల అనుమతులు తెలిపేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఓ కార్యాచరణను సిద్ధం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు దొరకని సమయంలో సైతం రాష్ట్రంలో ఏటా 46 లక్షల నుంచి 48 లక్షల కుటుంబాలు ప్రభుత్వం కలి్పంచే ఉపాధి హామీ పథకం పనులను చేసుకుంటూ, ఏటా ఐదున్నర వేల కోట్ల రూపాయల నుంచి ఆరు వేల కోట్ల రూపాయల వరకు లబి్ధపొందుతున్నాయి. రాష్ట్రంలో 2019 నుంచి ఇప్పటి వరకు ఆయా కుటుంబాలు ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం పనులు చేసుకోవడం ద్వారా ప్రత్యక్షంగా దాదాపు రూ.27,000 కోట్ల మేర కూలి రూపంలో లబి్ధపొందాయి.
ఇకపై ఆయా పనులు చేసుకునే కూలీలకు వ్యక్తిగత ఆస్తిని తయారు చేసే పనులే ఎక్కువగా ఉండేలా పనులు గుర్తించాలంటూ ప్రభుత్వం గత ఐదేళ్లుగా అనేకసార్లు ఎప్పటికప్పుడు జిల్లా, మండల, గ్రామ స్థాయి ఉపాధి హామీ పథకం సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు. చాలాచోట్ల ఇప్పటి దాకా ఎక్కువగా గ్రామాల్లో ఊరచెరువుల్లో పూడికతీత, లేదంటే రైతుల పొలాలకు సాగునీరు వెళ్లే కాల్వలకు పూడిక తీత ..వంటి పనులనే స్థానికంగా చేపడుతున్నారని... ఇక నుంచి ఈ తరహా పనులను వీలైనంత మేర తగ్గించి, పేదలకు రెండు రకాలా ప్రయోజనకరంగా ఉండే పనులను చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు.
మట్టి రోడ్ల నిర్మాణం, పండ్ల తోటల పెంపకానికి పెద్ద పీట..
గ్రామాల్లో పేదలు కూలి పనులు చేసుకుంటూ సొంతంగా ఆస్తుల కల్పనకు ఉపయోగపడేందుకు అవకాశమున్న పనులను గుర్తించే ప్రక్రియను గ్రామాల్లో ఐదు నెలల కిత్రమే అధికారులు చేపట్టారు. రోడ్డు వసతి లేని మారుమూల గిరిజన ప్రాంతాల్లో కేవలం కూలీల ద్వారా మట్టి రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. దీంతో పాటు సన్న చిన్నకారు రైతులను వివిధ రకాల పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సహించి, వాటి సాగులో గుంతల తవ్వకం మొదలు, మొక్కలు నాటే పనులకు ఉపాధి హామీ పథకం ద్వారా ఆరి్థక సహాయం అందించడం వంటి పనులకు పెద్ద సంఖ్యలో అనుమతులివ్వడానికి కార్యాచరణను సిద్ధం చేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు. దీనికితోడు గ్రామాల్లో కొత్తగా చేపల చెరువుల నిర్మాణ పనులకూ అనుమతులు తెలపనున్నట్టు వారు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment