కాంగ్రెస్ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి
కాంగ్రెస్ గ్యారంటీ పేరిట లేఖ విడుదల
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘కాంగ్రెస్ ఎప్పు డైనా విధానాలకు కట్టుబడి, లక్ష్యసాధన కోసం పనిచేసే పార్టీ. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి మూడు నెలల్లోనే పాలమూరు పునర్నిర్మాణం కోసం రూ.10 వేల కోట్లకుపైగా వెచ్చించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నారాయణపేట–కొడంగల్, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల, ప్రతిష్టా త్మక విద్య, వైద్య సంస్థల ఏర్పాటు, రోడ్లు, మౌలిక సదుపాయాల నిర్మాణం ఇలా ప్రతి రంగంలోనూ అభివృద్ధి పనులతో పాటు పథకాల అమలులో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు’ అని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ హస్తం అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధి ష్టానం వివిధ రాష్ట్రాలకు సంబంధించి శుక్రవారం తొలివిడతగా 39 మంది ఎంపీ అభ్యర్థుల జాబితా ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించినందుకు శనివారం కాంగ్రెస్ నాయకత్వానికి వంశీచంద్‌రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ.. మహబూబ్‌నగ ర్‌కు కాంగ్రెస్ గ్యారంటీ పేరిట లేఖ విడుదల చేశారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న పార్టీ నక్కజిత్తులతో పాలమూ రు మోసపోయింది.. ఇదే కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తెలంగాణనే కాదు, మహ బూబ్‌నగర్‌నూ పట్టించుకున్న సందర్భం లేదు.
ఆ పదేళ్ల నష్టాన్ని పూడుస్తూ, భవిష్యత్ వైపు నడిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థమైన విధానంతో అడుగులు వేస్తోందని తెలిపారు. అందుకే అడుగడు గునా ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తున్నా రని చల్లా పేర్కొన్నారు. పాలమూరు న్యాయయా త్రలో జనం గుండె చప్పుడు విన్నానని.. కరువు లేని మహబూబ్‌నగర్ ఆకాంక్షకు అనుగుణంగా జనం కోసం.. జలం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు నిర్మించి, జలకళ తెచ్చి, విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతానని, అందరూ తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment