Vamsichand Reddy
-
పాలమూరు.. ప్రతిష్టాత్మకం!
సాక్షి, హైదరాబాద్: పాలమూరు లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపును టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. సొంత నియోజకవర్గంలో విజయం కోసం ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీతో పోటాపోటీ ఉండొచ్చన్న సర్వేల అంచనాలే దీనికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన వరుస పర్యటనలు, అక్కడి నాయకులు, ప్రజలకు ఇస్తున్న హామీలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని అంటున్నారు. ఇక్కడ గెలవడం ద్వారా రాష్ట్ర, జిల్లా రాజకీయాలపై పూర్తి ఆధిపత్యం సాధించవచ్చని భావిస్తున్నారని.. ఈ క్రమంలో పార్టీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి కంటే ఎక్కువగా కష్టపడుతున్నారని కాంగ్రెస్ నేతలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. వీలైనప్పుడల్లా పర్యటిస్తూ.. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాపై రేవంత్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికతోపాటు లోక్‌సభ ఎన్నికపైనా దృష్టిపెట్టారు. అటు అధిష్టానానికి, ఇటు తనకు సన్నిహితుడైన వంశీచంద్‌రెడ్డికి లోక్‌సభ టికెట్ ఇప్పించారు. అధికారికంగా టికెట్ ప్రకటించకముందు, తర్వాత చాలాసార్లు వంశీతో భేటీ అయి ప్రచారం, ఇతర అంశాలపై వ్యూహాలను సిద్ధం చేశారు. అంతేకాదు వీలైనప్పుడల్లా మహబూబ్‌నగర్ పర్యటనలకు వెళ్తున్నారు. ఈ నెలలో ఇప్పటికే ఐదుసార్లు మహబూబ్‌నగర్‌కు వెళ్లిన రేవంత్.. రెండు సభల్లో పాల్గొన్నారు.రెండుసార్లు కొడంగల్ నేతలతో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లింది మూడే సార్లు కావడం గమనార్హం. తాజా సభల్లో, కార్యక్రమాల్లో రేవంత్ మాట్లాడుతున్న తీరు కూడా పాలమూరులో గెలుపే లక్ష్యంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని.. 70ఏళ్ల తర్వాత జిల్లాకు ముఖ్యమంత్రి పదవి వచి్చందని.. పార్టీలకతీతంగా జిల్లాను అభివృద్ధి చేసుకుందామని రేవంత్ చెప్తున్నారు. కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతల పథకం మంజూరు, వాల్మికి బోయ కులస్తులతో భేటీ అయి హామీలివ్వడం ద్వారా ఓటర్లను ఆకర్షించే వ్యూహాలను అమలు చేశారు. మ్మెల్యేలకు ‘స్పెషల్’గా హామీలిస్తూ.. పాలమూరులో గెలుపే లక్ష్యంగా అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారని.. ఇందుకోసం ఆ లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా హామీలు ఇస్తున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అందులోభాగంగానే మహబూబ్‌నగర్ సభ వేదికగా ముదిరాజ్‌లకు మంత్రివర్గంలో స్థానం కల్పింస్తామని ప్రకటించారని అంటున్నాయి. నియోజకవర్గాల వారీగా మంచి మెజార్టీ తీసుకురావాలని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతోపాటు కేబినెట్ హోదాతో కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తానని ఆయన ఎమ్మెల్యేలకు చెప్తున్నట్టు సమాచారం. -
డీకే అరుణ సోయి లేకుండా మాట్లాడుతున్నారు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: తనపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యక్తిగతంగా, సోయిలేకుండా మాట్లాడటం తగదని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వనితుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. శనివారం డీసీసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేవలం కుటుంబ సభ్యుల వ్యాపారాలు, స్వలాభం కోసమే ఆమె రాజకీయాలు నడుపుతున్నారని ఆరోపించారు. 2014లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా తనను ఓడించేందుకు ఎన్నో కుట్రలు పన్నారని, అయినా అక్కడి ప్రజల ఆదరాభిమానాలతో గెలుపొందానని పేర్కొన్నారు. 2006 నుంచే ఏఐసీసీ సభ్యుడిగా ఉన్నానని, ఆమెకు 2014 వరకు కాంగ్రెస్‌లో సభ్యత్వమే లేదన్నారు. ఎన్నో పార్టీలు మారిన డీకే అరుణ బీసీ ద్రోహి అని విమర్శించారు. తాను నాన్–లోకల్ కాదని ఉమ్మడి పాలమూరు బిడ్డనని వంశీచంద్‌రెడ్డి చెప్పారు. అప్పట్లో పాన్‌గల్ జెడ్పీటీసీ సభ్యురాలిగా కాంగ్రెస్ నుంచి డీకే అరుణ గెలుపొందినప్పుడు ఆమెకు ఈ విషయం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. కేవలం కాంట్రాక్టులు, లిక్కర్ దందాలు, ధనార్జన కోసమే రాజకీయాల్లో ఉన్న ఆమె బండారం బయటపెడతామన్నారు. ఈ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి ఓడిపోతాననే అక్కసుతో ఎలాంటి సోయి లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. కనీసం తన పుట్టిన ఊరు ధన్వాడ మండలానికి గానీ, నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతలకుగానీ అరుణ ఏమీ చేయలేకపోయారని, రాజకీయ విలువలు లేని ఆమె తీరుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఈ ప్రాంత సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. -
‘పాలమూరు’ పునర్నిర్మాణానికి రూ.10 వేల కోట్లతో ప్రణాళికలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘కాంగ్రెస్ ఎప్పు డైనా విధానాలకు కట్టుబడి, లక్ష్యసాధన కోసం పనిచేసే పార్టీ. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి మూడు నెలల్లోనే పాలమూరు పునర్నిర్మాణం కోసం రూ.10 వేల కోట్లకుపైగా వెచ్చించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నారాయణపేట–కొడంగల్, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల, ప్రతిష్టా త్మక విద్య, వైద్య సంస్థల ఏర్పాటు, రోడ్లు, మౌలిక సదుపాయాల నిర్మాణం ఇలా ప్రతి రంగంలోనూ అభివృద్ధి పనులతో పాటు పథకాల అమలులో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు’ అని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ హస్తం అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధి ష్టానం వివిధ రాష్ట్రాలకు సంబంధించి శుక్రవారం తొలివిడతగా 39 మంది ఎంపీ అభ్యర్థుల జాబితా ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించినందుకు శనివారం కాంగ్రెస్ నాయకత్వానికి వంశీచంద్‌రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ.. మహబూబ్‌నగ ర్కు కాంగ్రెస్ గ్యారంటీ పేరిట లేఖ విడుదల చేశారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న పార్టీ నక్కజిత్తులతో పాలమూ రు మోసపోయింది.. ఇదే కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తెలంగాణనే కాదు, మహ బూబ్నగర్నూ పట్టించుకున్న సందర్భం లేదు. ఆ పదేళ్ల నష్టాన్ని పూడుస్తూ, భవిష్యత్ వైపు నడిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థమైన విధానంతో అడుగులు వేస్తోందని తెలిపారు. అందుకే అడుగడు గునా ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తున్నా రని చల్లా పేర్కొన్నారు. పాలమూరు న్యాయయా త్రలో జనం గుండె చప్పుడు విన్నానని.. కరువు లేని మహబూబ్‌నగర్ ఆకాంక్షకు అనుగుణంగా జనం కోసం.. జలం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు నిర్మించి, జలకళ తెచ్చి, విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతానని, అందరూ తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. -
రాజకీయ భిక్ష పెట్టిన జిల్లాకే అన్యాయం
దేవరకద్ర/జడ్చర్ల/కొందుర్గు: పాలమూరు– రంగారెడ్డి పథకాన్ని ఎండబెట్టారని, మేడిగడ్డను బొందపెట్టారని ఏఐసీసీ నేత వంశీచంద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన చలో పాలమూరు– రంగారెడ్డి రిజర్వాయర్ల సందర్శన చేపట్టారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి భూత్పూర్ మండలం కర్వెన, జడ్చర్ల మండలం ఉద్ధండాపూర్ రిజర్వాయర్లను సందర్శించారు. రంగారెడ్డి జిల్లా జిల్లేడ్ చౌదరిగూడ మండలం లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని కూడా ఈ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వంశీచంద్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు వాస్తవ రూపం ప్రజలకు తెలియాలని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. 2015 లో శిలాఫలకం వేసిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును కుర్చీ వేసుకుని కూర్చొని మూడేళ్లలో పూర్తి చేస్తానని గొప్పలు చెప్పిన కేసీఆర్.. రెండుసార్లు అధికారంలోకి వచ్చి నా ఒక్క ఎకరాకు నీరివ్వలేదని వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. పాల మూరు జిల్లా ఎడారిగా మారుతున్నా పట్టించుకోలేదని, 2009లో ఎంపీగా గెలిపించి రాజకీయంగా భిక్ష పెట్టిన జిల్లాకే తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ప్రజలను మోసం చేయడానికి ఒక పంపును నామమాత్రంగా ప్రారంభించి పూర్తి చేశామని గొప్పలు చెప్పారని విమర్శించారు. కర్వెన రిజర్వాయర్ ఇప్పటికీ అసంపూర్తి పనులతో అస్తవ్యస్తంగా ఉందన్నారు. ప్రపంచంలోనే ఎనిమిదో వింతగా అభివర్ణించిన కాళేశ్వరంను బొంద పెట్టారన్నారు. కమీషన్ల కక్కుర్తితో మేడిగడ్డ పగుళ్లతో కుంగిపోవడానికి కారణం అయ్యారని ఆరోపించారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులకు పిచ్చి పట్టిందని.. ఎర్రగడ్డకు వెళ్లాల్సిన నాయకులు, మేడిగడ్డకు వెళ్లారని ఎద్దేవా చేశారు. బృందంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు జి.మధుసూదన్‌రెడ్డి, పరి్ణకారెడ్డి, అనిరుధ్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, ఈర్లపల్లి శంకర్, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు. -
సీఎంతో వంశీచంద్‌రెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డితో ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ చార్జి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి భేటీ అయ్యారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన వంశీ.. చాలా సేపు ఆయనతో సమా వేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రజాపాలన కార్యక్రమంతోపాటు పార్టీ సంస్థాగత వ్యవహా రాలపై చర్చ జరిగిందని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. గత 22 రోజుల ప్రభుత్వ పాల న తీరు, అధికారుల నియామకంలో పారదర్శ కత, ప్రజాపాలన నిర్వహణపై సీఎంకు వంశీ అభినందనలు తెలిపారని సమాచారం. కాంగ్రెస్ వర్గాల్లో ఊహాగానాలు.. నాగ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవ సభకు హాజరై వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం సచివాలయానికి రాలేదు. ఉదయం నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఉన్న రేవంత్.. సీఎంవో అధికా రులతో భేటీ అయ్యారు. తనను కలిసేందుకు వచ్చిన కాంగ్రెస్ నాయకులతో సమావేశమ య్యారు. అయితే, ఏఐసీసీ పక్షాన వంశీచంద్‌రెడ్డి సీఎం రేవంత్‌ను కలవడం, అది కూడా చాలా సేపు ఈ భేటీ జరగడంతో కాంగ్రెస్ వర్గాల్లో ఊహా గానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఢిల్లీ పర్యటనలో రేవంత్, భట్టి విక్రమార్కలు పీసీసీ అధ్యక్ష ఎన్నికపై పార్టీ పెద్దలతో చర్చించారన్న వార్తల నేపథ్యంలో వంశీచంద్‌రెడ్డి తాజాగా రేవంత్‌ను కలవడం చర్చనీయాంశమవుతోంది. ఈ భేటీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం చర్చకు వచ్చి ఉంటుందని, ఏఐసీసీ పక్షాన ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారం తీసుకుని వంశీ, రేవంత్‌ను కలసి ఉంటారనే చర్చ జరుగుతోంది. మరోవైపు పీసీసీ అధ్య క్షుడి ఎంపికపై కూడా ఇరువురు నేతలు చర్చించి ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
ఆచితూచి..అత్యున్నత హోదా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో తెలంగాణ నేతలకు చోటు కల్పించే విషయంలో అధిష్టానం ఆచితూచి వ్యవహరించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి, మాదిగ సామాజిక వర్గానికి చెందిన దామోదర రాజనర్సింహను సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వనితుడిగా నియమించడం వెనుక పార్టీ హైకమాండ్‌కు భారీ వ్యూహమే ఉందనే చర్చ జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని పార్టీ పరిస్థితులు, సామాజిక సమతుల్యతలను దృష్టిలో ఉంచుకునే, ఎవరూ ఊహించని విధంగా దామోదరకు స్థానం కల్పించారని, దళిత వర్గాలను ఆకట్టుకోవాలనే ఆలోచనతోనే ఆయనకు అత్యున్నత హోదాను కట్టబెట్టారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరో నాయకుడు, విద్యార్థి సంఘం నుంచి పార్టీలో పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డికి కూడా పార్టీ తగిన గుర్తింపు ఇచ్చిందనే చర్చ జరుగుతోంది. చాలాకాలంగా ఆయన ఢిల్లీ కేంద్రంగా పార్టీ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇప్పటికే ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న వంశీ.. పార్టీ పెద్దలకు అనేక అంశాల్లో సహాయకారిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ కేంద్రంగా వంశీ సేవలను వినియోగించుకోవాలన్న ఆలోచనతో ఆయనను ప్రత్యేక ఆహ్వనితుడిగా నియమించినట్టు సమాచారం. అయితే, సీడబ్ల్యూసీలో స్థానం కల్పిస్తారంటూ ప్రచారం జరిగిన కొందరికి చోటు దక్కకకపోవడం, పార్టీపరంగా ఏ మాత్రం ప్రభావం లేని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులకు నేరుగా స్థానం కల్పించి, అధికారంలోకి రావాలని భావిస్తున్న తెలంగాణ నేతలను మాత్రం ఆహ్వనితుల హోదాకు మాత్రమే పరిమితం చేయడంపై రాష్ట్ర పార్టీలో చర్చ జరుగుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సీడబ్ల్యూసీలో స్థానం దక్కవచ్చనే చర్చ గతంలో జరిగింది. మరో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఆ రేసులో ఉన్నారని, గిరిజన మహిళ కోటాలో సీతక్కకు అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావించారు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అనూహ్యంగా దామోదర, వంశీలకు స్థానం కల్పించడం గమనార్హం. రేవంత్, భట్టి అభినందనలు కాంగ్రెస్ అత్యున్నత స్థాయి కమిటీ అయిన సీడబ్ల్యూసీలో స్థానం పొందిన తెలంగాణ నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలు అభినందనలు తెలిపారు. తెలంగాణకు సీడబ్ల్యూసీలో స్థానం కల్పించినందుకు గాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీకి ఆదివారం వారు వేర్వేరు ప్రకటనల్లో కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ వర్గంలో కీలకంగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజుకు కూడా సీడబ్ల్యూసీలో చోటు దక్కడం పట్ల భట్టి హర్షం వ్యక్తం చేశారు. ఆశావహుల్లో అసంతృప్తి! ఇదిలా ఉండగా సీడబ్ల్యూసీలో కచ్చితంగా అవకాశం లభిస్తుందని ఆశించిన రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గీయులు నారాజ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవిని ఆశించిన కోమటిరెడ్డి కొంతకాలం పాటు అసమ్మతితో ఉన్నా ఆ తర్వాత క్రమంగా సర్దుకున్నారు. అయితే అధిష్టానం మాత్రం ఆయనను స్టార్ క్యాంపెయినర్ హోదాకు మాత్రమే పరిమితం చేసింది. ఇటీవల నియమించిన స్క్రీనింగ్ కమిటీలోనూ ఆయనకు చోటు దక్కకపోవడంతో అధిష్టానం ఏదైనా మంచి హోదా కల్పిస్తుందనే ఆశతో కోమటిరెడ్డి శిబిరం ఉంది. కానీ సీడబ్ల్యూసీ లోనూ పేరు కనిపించకపోవడంతో కోమటిరెడ్డి అనుచరులు నైరాశ్యంలో మునిగిపోయారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో తమకు సీడబ్ల్యూసీలో స్థానం దక్కుతుందని భావించిన సీనియర్ నేతలు వీహెచ్, పొన్నాల కూడా హైకమాండ్ తాజా నిర్ణయంతో అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మొదటి నుంచి కాంగ్రెస్ వర్గాల చర్చలో ఉన్న నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి కూడా అవకాశం రాకపోవడం, రాహుల్ దృష్టిలో ఉన్నారని, రేవంత్ కూడా సిఫారసు చేశారని ప్రచారం జరిగి, గిరిజన కోటాలో ఈ సారి చాన్స్ ఉంటుందని భావించిన ఎమ్మెల్యే సీతక్కపేరు కూడా జాబితాలో కనిపించక పోవడంతో వారి మద్దతుదారులు అసంతృప్తిలో మునిగిపోయారు. మొత్తం మీద ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణకు చెందిన మరో ఒకరిద్దరు నేతలకు సీడబ్లూసీలో చోటు కల్పిస్తే బాగుండేదనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో కనిపిస్తోంది. -
రాజగోపాల్‌రెడ్డి ఎపిసోడ్.. కాంగ్రెస్ బుజ్జగింపులు కంటిన్యూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేత, నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలో పేరుకుపోయిన అసంతృప్తిని చల్లార్చేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. గత కొన్నిరోజులుగా ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తారని, బీజేపీకి వెళ్తారని.. విస్తృతస్థాయిలో ప్రచారం జరుగుతోంది. అలాగే పార్టీ మారే విషయంపై ఆయన నేరుగా స్పందించకుండానే రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈ తరుణంలో.. కాంగ్రెస్ పెద్దలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో వరుసగా సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయన ఇంటికే క్యూ కడుతున్నారు. తాజాగా.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో రాజగోపాల్‌రెడ్డి భేటీ ముగిసింది. రాజగోపాల్‌రెడ్డి ఇంట్లో గంటపాటు ఈ ఇద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డి పార్టీ వీడకుండా ఆపే బాధ్యతను ఉత్తమ్‌కు అప్పగించింది ఏఐసీసీ. అదే సమయంలో ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి సైతం రాజగోపాల్‌రెడ్డితో భేటీ అయ్యారు. వీళ్ల భేటీ తాలుకా సారాంశం మాత్రం బయటకు రాలేదు. మునుగోడులో పర్యటన ఇదిలా ఉండగా.. తెలంగాణలో పొలిటికల్ హీట్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఇవాళ(శనివారం) చౌటుప్పల్, సంస్థాన్ నారాయణ పురం, మునుగోడు మండలాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేస్తారన్న ప్రచారం తర్వాత తొలిసారిగా మునుగోడుకు వస్తున్న ఆయన.. మధ్యాహ్నాం మీడియా సమావేశం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశంలోనే ఆయన కీలక ప్రకటన చేయనున్నట్లు ఆయన అనుచరులు భావిస్తున్నారు. -
సతీసమేతంగా ప్రచారం..
సాక్షి, కల్వకుర్తి: కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి బుధవారం తన సతీమణి అశ్లేషారెడ్డితో కలిసి ఆమనగల్లు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చేతి గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. -
అన్నా.. చేతి గుర్తు మర్చిపోవద్దు
ఆమనగల్లు: కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి మంగళవారం కడ్తాల మండల పరిధిలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ బస్సులో వెళ్తున్న వృద్ధుడిని పలకరించారు. చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. -
‘ఆ ఎమ్మెల్యే ఓ చీడపురుగు’
సాక్షి, హైదరాబాద్ : ఏమాత్రం ఆత్మగౌరవం లేని కాంగ్రెస్ పార్టీలో కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఓ చీడపురుగని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విమర్శించారు. వంశీచంద్ తన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలని, మంత్రి కేటీఆర్‌పై వంశీ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. పాలమూరు ప్రజలకు పౌరుషం, ఆత్మగౌరవం ఉంది కాబట్టే అప్పట్లో ఎన్టీఆర్‌ను ఓడించారని, చరిత్రలోకి వెళితే కాంగ్రెస్ గురించి మాట్లాడాల్సింది చాలా ఉంటుందన్నారు. కాంగ్రెస్ కోర్టులను నమ్ముకుందని, టీఆర్ఎస్ ప్రజలను నమ్ముకుందని పేర్కొన్నారు. పెద్దవాళ్ళను విమర్శిస్తే తానూ పెద్దవాడిని అవుతాననే తప్పుడు వ్యూహాంలో వంశీ వెళ్తున్నాడని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌పై విమర్శలు మానకపోతే ఆయనను స్థానిక ప్రజలే కల్వకుర్తికి రానివ్వని పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వలసలు పెరగడాన్ని జీర్ణించుకోలేకే ఎమ్మెల్యే వంశీ విమర్శలకు దిగుతున్నారన్నారు. పొరుగు రాష్ట్రం సీఎం ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రను గ్రహించే టీఆర్ఎస్లోని దళిత ఎమ్మెల్యేలమంతా ముఖ్యమంత్రిగా కేసీఆర్ పేరును ప్రతిపాదించామని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే దళితుడిని సీఎం చేస్తామని తమ మేనిఫెస్టోలో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా కాంగ్రెస్ నేత లగడపాటి రాజగోపాల్ మనిషి అయిన వంశీని ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించామా అని కల్వకుర్తి ప్రజలు ఇపుడు బాధపడుతున్నారని అన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటైతే స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తాయని, కానీ, కల్వకుర్తి ఎమ్మెల్యేకు అది ఇష్టంలేక అడ్డుపడుతున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే వంశీచంద్ వెంట ఆయన బంధువులు తప్ప చివరకు ఎవరు మిగిలే పరిస్థితి లేదని, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు. మండలిలో విపక్ష నేత ప్రభుత్వాన్ని పొగుడుతుంటే తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చిన వంశీ పబ్లిసిటీ కోసం ప్రభుత్వాన్ని తిడుతున్నాడని ధ్వజమెత్తారు. కల్వకుర్తికి సాగునీరిచ్చిన ప్రభుత్వాన్ని పొగడాల్సింది పోయి వంశీ విమర్శలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. కల్వకుర్తిలో కాంగ్రెస్‌కు బీటలు పడుతున్నాయనే అక్కసుతోనే ఆయన దిగజారి మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. -
టీ యూత్ కాంగ్రెస్ కమిటీ రద్దు
హైదరాబాద్: తెలంగాణ యూత్ కాంగ్రెస్ కమిటీని రద్దు చేశారు. కొత్త కమిటీ ఎంపిక కోసం రద్దు చేసినట్టు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీలను ఎంపిక చేయనున్నట్టు వంశీచంద్ రెడ్డి చెప్పారు. ఆగస్టు 10 నుంచి తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయడం లేదని వంశీచంద్ రెడ్డి చెప్పారు. -
వంశీ, విష్ణుల మధ్య జరిగింది చిన్న కొట్లాటే!
హైదరాబాద్ : కాంగ్రెస్ యువ నేతలు వంశీచంద్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిల మధ్య జరిగింది చిన్న కొట్లాట మాత్రమేనని ఆపార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. ఉద్రేకంలో జరిగిన గొడవను ఇద్దరూ మర్చిపోయి పార్టీ కోసం పనిచేయాలని ఆయన శనివారమిక్కడ సూచించారు. బీజేపీ వరుసగా హిందుత్వ అంశాలను చేపడతూ ప్రజలను రెచ్చగొడుతోందని వీహెచ్ ఆరోపించారు. ముస్లింలను హిందువులుగా మార్చాలన్నదే ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ అజెండానా? అని ఆయన ప్రశ్నించారు. హిందూ దేశంగా మార్చాలని బీజేపీ ఆలోచిస్తోందని... బీజేపీకి అధికారం ఇచ్చింది అందుకేనా? అంటూ వీహెచ్ మండిపడ్డారు. -
'విద్యుత్ సమస్య పరిష్కారంలో సీఎం విఫలం'
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్యలను తీర్చడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మండిపడ్డారు. కరెంటు కోతల వల్ల పంటలు ఎండిపోయి.. ఇటీవలి కాలంలోనే ఏకంగా 240 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన చెప్పారు. దీనంతటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. రైతు సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీని తక్షణమే రెండు రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశ పరచాలని ఆయన డిమాండ్ చేశారు. కావాలంటే బడ్జెట్ సమావేశాలను ఎప్పుడైనా పెట్టుకోవచ్చు గానీ, ముందు అత్యవసరంగా విద్యుత్ సమస్య, రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి, దీనికో పరిష్కారాన్ని చూడాల్సిన అవసరం ఉందని వంశీచంద్ రెడ్డి అన్నారు. -
కాంగ్రెస్ మైదానం ఖాళీ !
జాతీయ యువజన కాంగ్రెస్ సదస్సులో రాహుల్ వ్యాఖ్య హైదరాబాద్ : ‘‘ప్రస్తుతం కాంగ్రెస్ పిచ్ ఖాళీగా ఉంది. మైదానంలో చోటు దక్కించుకునే అవకాశాలు మీకే ఎక్కువగా ఉన్నాయి. ఇక మీరెంత కష్టపడితే అంత చోటును సంపాదించుకోవచ్చు’’ అని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జాతీయ యువజన కాంగ్రెస్ కార్యవర్గం ముగింపు సమావేశంలో రాహుల్‌గాంధీ మాట్లాడారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, మరికొందరు ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.