ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందిస్తున్న వంశీచంద్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డితో ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ చార్జి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి భేటీ అయ్యారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన వంశీ.. చాలా సేపు ఆయనతో సమా వేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రజాపాలన కార్యక్రమంతోపాటు పార్టీ సంస్థాగత వ్యవహా రాలపై చర్చ జరిగిందని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. గత 22 రోజుల ప్రభుత్వ పాల న తీరు, అధికారుల నియామకంలో పారదర్శ కత, ప్రజాపాలన నిర్వహణపై సీఎంకు వంశీ అభినందనలు తెలిపారని సమాచారం.
కాంగ్రెస్ వర్గాల్లో ఊహాగానాలు..
నాగ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవ సభకు హాజరై వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం సచివాలయానికి రాలేదు. ఉదయం నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఉన్న రేవంత్.. సీఎంవో అధికా రులతో భేటీ అయ్యారు. తనను కలిసేందుకు వచ్చిన కాంగ్రెస్ నాయకులతో సమావేశమ య్యారు. అయితే, ఏఐసీసీ పక్షాన వంశీచంద్‌రెడ్డి సీఎం రేవంత్‌ను కలవడం, అది కూడా చాలా సేపు ఈ భేటీ జరగడంతో కాంగ్రెస్ వర్గాల్లో ఊహా గానాలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇటీవల ఢిల్లీ పర్యటనలో రేవంత్, భట్టి విక్రమార్కలు పీసీసీ అధ్యక్ష ఎన్నికపై పార్టీ పెద్దలతో చర్చించారన్న వార్తల నేపథ్యంలో వంశీచంద్‌రెడ్డి తాజాగా రేవంత్‌ను కలవడం చర్చనీయాంశమవుతోంది. ఈ భేటీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం చర్చకు వచ్చి ఉంటుందని, ఏఐసీసీ పక్షాన ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారం తీసుకుని వంశీ, రేవంత్‌ను కలసి ఉంటారనే చర్చ జరుగుతోంది. మరోవైపు పీసీసీ అధ్య క్షుడి ఎంపికపై కూడా ఇరువురు నేతలు చర్చించి ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment