
'విద్యుత్ సమస్య పరిష్కారంలో సీఎం విఫలం'
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్యలను తీర్చడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్యలను తీర్చడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి మండిపడ్డారు. కరెంటు కోతల వల్ల పంటలు ఎండిపోయి.. ఇటీవలి కాలంలోనే ఏకంగా 240 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన చెప్పారు. దీనంతటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.
రైతు సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీని తక్షణమే రెండు రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశ పరచాలని ఆయన డిమాండ్ చేశారు. కావాలంటే బడ్జెట్ సమావేశాలను ఎప్పుడైనా పెట్టుకోవచ్చు గానీ, ముందు అత్యవసరంగా విద్యుత్ సమస్య, రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి, దీనికో పరిష్కారాన్ని చూడాల్సిన అవసరం ఉందని వంశీచంద్ రెడ్డి అన్నారు.